ఆంధ్ర సరిహద్దుల్లో మిడతల దండు.. ఆందోళనలో రైతులు..!

ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు దాడి చేసింది. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లిలో మిడతల దండు ప్రత్యక్షమైంది.

  • Tv9 Telugu
  • Publish Date - 8:55 am, Sun, 31 May 20
ఆంధ్ర సరిహద్దుల్లో మిడతల దండు.. ఆందోళనలో రైతులు..!

ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు దాడి చేసింది. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లిలో మిడతల దండు ప్రత్యక్షమైంది. రాత్రికి రాత్రే మిడతలు పంటను నాశనం చేస్తున్నాయి. పచ్చగా కనిపించే ప్రతి చెట్టును తినేస్తున్న ఈ దండు.. అరటి చెట్లను వదలడం లేదు. వేపనపల్లె నుంచి మిడతల దండు గుడుపల్లె మండలం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆంధ్ర రైతులు బయపడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు. మిడతలపై ఫర్టిలైజర్లు చల్లి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మిడతల దండు మహారాష్ట్ర నుంచి వచ్చినది కాదని అధికారులు చెబుతున్నారు.

మరో వైపు విశాఖపట్టణంలోనూ మిడతల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లా రోలుగుంట మండలం పడాలపాలెంలో శనివారం మిడతల దండు కనిపించింది. గ్రామంలోని చెరకు తోటల్లోకి ఒక్కసారిగా మిడతలు వచ్చి వాలాయి. దాంతో రైతులు, వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగారు.

Read This Story Also: సీరియళ్ల షూటింగ్‌కి అనుమతిచ్చిన ప్రభుత్వం..!