జూన్‌ 4న కృష్ణా బోర్డు సమావేశం…జలజగడం ముగిసేనా..?

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం రోజురోజుకూ ముదురుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది.హైదరాబాద్‌ జలసౌధలో

జూన్‌ 4న కృష్ణా బోర్డు సమావేశం...జలజగడం ముగిసేనా..?
Follow us

|

Updated on: May 30, 2020 | 6:58 PM

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం రోజురోజుకూ ముదురుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది.హైదరాబాద్‌ జలసౌధలో జూన్‌ 4వ తేదీన ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సమాచారం అందించారు.

తెలంగాణలో నిర్మించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ సామర్థ్యాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని.. వాటికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ… కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. ఏపీ ఫిర్యాదు మేరకు ప్రాజెక్టుల వివరాలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కృష్ణాబోర్డు.ఈ మేరకు గతంలోనే తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఇప్పటికే బోర్డు లేఖ రాసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇవే కాకుండా మరే ఇతర అంశాలపైన సమావేశంలో చర్చించాల్సి ఉంటే.. ప్రతిపాదనలు పంపిచాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఇప్పటికే లేఖ రాసింది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్‌,జగన్ మోహన్ రెడ్డి వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఈ తరుణంలో కృష్ణా బోర్డు సమావేశంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!