Vizag: కిడ్నీ ఇస్తే ఎనిమిదిన్నర లక్షలు ఇస్తామన్నారు.. ఇచ్చేసిన బాధితుడు.. ఆ తర్వాత
వినయ్‌కుమార్‌కి డబ్బు ఆశచూపారు. ఎనిమిదిన్నర లక్షలు పక్కా ఇస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో వినయ్ ఓకే చెప్పాడు. ఆపరేషన్ కూడా చేసేశారు. కానీ ఆ తర్వాత బాధితుడికి అసలు ట్విస్ట్ ఇచ్చారు కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు.
విశాఖతీరంలో కిడ్నీ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. డబ్బు ఆశచూపి…అమాయకుల కిడ్నీలను కాజేసి, ప్రాణాలు తీసేస్తోన్న కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. పెందుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుత్రి ఈ దారుణమైన కిడ్నీరాకెట్ దందాకి తెరతీసింది. అమాయకులకు ఎరవేసి…పేదజనం అవయవాలను కాజేస్తోన్న ఓ ముఠా చేతిలో బలయ్యాడు వినయ్ అనే యువకుడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఏడుగురు బాధితుల నుంచి ఈ బ్రోకర్‌గాళ్ళుకిడ్నీలు తీసేసుకున్న దారుణ ఘటన టీవీ9 దృష్టికి వచ్చింది.
విశాఖలోని మధుర వాడ వాంబేకాలనీలో వెలుగుచూసిన కిడ్నీరాకెట్ దందా…దడపుట్టిస్తోంది. అదే ఓ యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవ్వరో కాదు… ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పెందుర్తిలోని తిరుమల ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు.
కిడ్నీ మార్పిడి చేసేసి, యథేచ్ఛగా సొమ్ముచేసకుంటోంది దోపిడీ ముఠా. వాంబేకాలనీకి చెందిన వినయ్‌కుమార్‌కి డబ్బు ఆశచూపి కామరాజు, శ్రీను అనే ఇద్దరు కిడ్నీ బ్రోకర్లు ఒక కిడ్నీ అమ్మేస్తే…8లక్షల 50 వేలు ఇస్తామని నమ్మబలికారు. ఆపరేషన్ అయ్యాక రెండు లక్షలు చేతిలో పెట్టి ఉడాయించారు. ఇటు కిడ్నీ పోగొట్టుకొని ప్రాణాపాయ స్థితిలో విలవిల్లాడుతున్నాడు కిడ్నీ రాకెట్ బాధితుడు వినయ్ కుమార్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం