Infosys In Vizag: విశాఖ వైపు దృష్టి సారించిన ఐటీ కంపెనీలు.. ఇన్ఫోసిస్‌ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి ముహర్తం ఫిక్స్..

టాలెంట్ పూల్‌ను చేరుకోవాలనే ప్రణాళికలో భాగంగా ఇన్ఫోసిస్ కోయంబత్తూర్, వైజాగ్, కోల్‌కతా మరియు నోయిడా వంటి టైర్-II నగరాల్లో తన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Infosys In Vizag: విశాఖ వైపు దృష్టి సారించిన ఐటీ కంపెనీలు.. ఇన్ఫోసిస్‌ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి ముహర్తం ఫిక్స్..
Infosys
Follow us

|

Updated on: Sep 26, 2022 | 8:30 PM

Infosys In Vizag: విశాఖ పై ఐటి కంపెనీలు దృష్టి సారించాయి. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ అక్టోబర్‌ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. మధురవాడ ఐటీ సెజ్‌లోని మహతి సొల్యూషన్స్‌ ప్రాంగణంలో ఇన్ఫోసిస్‌ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలుపెట్టి.. క్రమంగా 3 వేల మంది ఉద్యోగులకు విస్తరించనున్నట్టు ఇన్ఫోసిస్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ సమర్పించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్‌ టెక్నాలజీస్‌ సెంటర్‌ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2.52లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మధురవాడ ఐటీ పార్క్‌లో వడి వడిగా నిర్మాణాలను చేపడుతోంది. ఈ ఏడాది చివరిలోగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు డల్లాస్‌ టెక్నాలజీస్‌ వడివడిగా అడుగేస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఐటి శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్ నిర్ధారించగా, ఇన్ఫోసిస్ రాకను స్వాగతిస్తూ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు కూడా విశేష స్పందన లభించింది.

పోర్ట్ సిటీలో విశాఖ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. 1000 మంది తో మరొక ఐటీ కంపెనీ లో లక్ష చదరపు అడుగుల స్థలాన్ని తీసుకుని అక్టోబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ఇన్ఫోసిస్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. టాలెంట్ పూల్‌ను చేరుకోవాలనే ప్రణాళికలో భాగంగా ఇన్ఫోసిస్ కోయంబత్తూర్, వైజాగ్, కోల్‌కతా మరియు నోయిడా వంటి టైర్-II నగరాల్లో తన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇండోర్ మరియు నాగ్‌పూర్‌లలో చిన్న కేంద్రాలను కలిగి ఉండగా, ఇప్పుడు వైజాగ్‌తో సహా ఈ టైర్-2 నగరాల్లో కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు ఇన్ఫోసిస్ గ్రూప్ మానవ వనరుల అభివృద్ధి విభాగం ఇటీవల ప్రకటించింది.

వైజాగ్‌లోని ఇన్ఫోసిస్ కార్యాలయం కేవలం శాటిలైట్ సెంటర్‌గా కాకుండా కనీసం 1,000 సీట్ల సామర్థ్యంతో ఉందనున్నట్టు తెలిపింది. కోవిడ్ మహమ్మారి సమయంలో వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లిన ప్రతిభావంతులైన ఉద్యోగులను చేరుకోవడానికి దిగ్గజ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ ఇలాంటి టైర్ -2 నగరాల్లో కార్యాలయాలను ప్రారంభించే ప్రణాళికలో ఉంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని ఐటీ సెజ్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం గత కొంతకాలంగా సెర్చ్ చేస్తోంది ఇన్ఫోసిస్. వచ్చే త్రైమాసికం చివరి నాటికి వైజాగ్ మరియు మరో మూడు కొత్త ప్రదేశాలలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా మహతి ఐటీ పార్కు లో ఒక లక్ష చదరపు అడుగుల స్థలాన్ని తీసుకుంది.

ఇవి కూడా చదవండి

వైజాగ్‌లో కనీసం 1 మిలియన్ చదరపు అడుగుల ప్లగ్-అండ్-ప్లే స్పేస్‌ల లభ్యత ఉండడం తో ఐటి రంగ అవకాశాలు పెరగవచ్చన్న చర్చ జరిగింది కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి వృద్ధిని చూడలేదు. తాజాగా ఇన్ఫోసిస్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు వైజాగ్‌కు రావడం స్వాగతించే సంకేతం. అనేక కారణాల వల్ల వైజాగ్‌ని విడిచి వెళ్లకూడదనుకునే స్థానికప్రతిభావంతులకు ఉపాధి కల్పించడంతో పాటు స్థానిక మౌలిక సదుపాయాల వ్యవస్థను మెరుగుపరుస్తుందన్న ఆశాభావం అందరిలో ఉంది.

Reporter: Eswar, TV9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..