Postal GDS Results: 44,228 తపాలా జీడీఎస్ పోస్టుల ఫలితాలు విడుదల.. భారీగా తగ్గిన కటాఫ్ మార్కులు
తెలుగు రాష్ట్రాల్లో తపాలా విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో కటాఫ్ మార్కులు భారీగా తగ్గాయి. ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు..
హైదరాబాద్, నవంబర్ 13: దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి తపాలా శాఖ నాలుగో విడత ఫలితాలు వెల్లడించింది. వివిధ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో మొత్తం 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల అభ్యర్ధులు ఈ కింది లింక్ ద్వారా నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేశారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈసారి భారీగా భారీగా కటాఫ్ తగ్గింది. కటాఫ్ పరిశీలిస్తే ఏపీలో 83.1667 మార్కులు, తెలంగాణలో 91.8333 మార్కులు పొందినవారిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.
నాలుగో విడత ఫలితాల్లో పేర్లున్న వారంతా నవంబర్ 27వ తేదీ లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి చేపట్టారు. ఈ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో వెరిఫికేషన్‌కు హాజరుకావల్సి ఉంటుంది. పదో తరగతి అర్హత ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తున్నారు.
ఏపీ తపాలా జీడీఎస్ పోస్టుల నాలుగో జాబితా ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ తపాలా జీడీఎస్ పోస్టుల నాలుగో జాబితా ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నవంబర్ 26 నుంచి కాకతీయ వర్సిటీ డిగ్రీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు నవంబరు 26 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ ఎస్. నరసింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ఎం తిరుమలదేవి ఓ ప్రకటనలో తెలిపారు. వర్సిటీ ఎబ్‌సైట్‌లో పరీక్షల టైంటేబుల్ విడుదల చేశామని, పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ చూడవచ్చని సూచించారు.