AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 2 Exam Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ మళ్లీ వాయిదా.. కొత్త ప‌రీక్ష తేదీ ఇదే

రాష్ట్ర ప్రభుత్వం వచ్చ ఏడాది జనవరిలో నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ పరీక్ష మరోమారు వాయిదా పడింది. ఈ మేరకు APPSC అధికారిక ప్రకటన జారీ చేసింది. మళ్లీ ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది..

APPSC Group 2 Exam Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ మళ్లీ వాయిదా.. కొత్త ప‌రీక్ష తేదీ ఇదే
APPSC Group 2 Exam Postponed
Srilakshmi C
|

Updated on: Nov 13, 2024 | 4:19 PM

Share

అమరావతి, నవంబర్‌ 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న గ్రూప్‌ 2 మెయిన్స్ ప‌రీక్ష మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ఇటీవల ప్రక‌టించిన షెడ్యూల్‌ మేరకు గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన నిర్వహించనున్నట్లు విష‌యం తెలిసిందే. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీని మార్చినట్లు సమాచారం. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ మధ్య రాత పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. డీఎస్సీ పరీక్షల తర్వాత ఇంటర్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల పరీక్షా కేంద్రాలు బిజీగా ఉండనున్నాయి.

మరోవైపు గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష రాసేవారిలో కొంత మంది డీఎస్సీకి కూడా హాజరవుతారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వాటి కన్నా ముందే గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ భావించినా.. ప్రకటిత తేదీ నుంచి పరీక్ష రాసేందుకు మూడు నెలల వ్యవధి ఇవ్వాలని మరికొందరు గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్‌ చేయసాగారు. వీటన్నింటి నేపథ్యంలో కమిషన్‌ గ్రూప్‌ 2 మెయిన్స్‌ను మరోమారు వాయిదా వేసింది.

కాగా గత ప్రభుత్వ హాయంలో గతేడాది డిసెంబర్‌ 7న గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రకటన ఇచ్చిన రెండు నెలల వ్యవధిలోనే అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను కూడా నిర్వహించింది. ఈ పరీక్షకు 4,83,535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్‌ 10న గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 92, 250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరందరికీ తొలుత జులై 28న మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఆధికారం చేపట్టిన కూటమి సర్కార్‌ ఇప్పటి వరకూ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీని రెండు సార్లు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విన్నపం మేర‌కు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. కాగా మొత్తం 905 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు