Vizag: ఆంధ్రా కాశ్మీరంలో విరివిగా కాస్తున్న స్ట్రాబెర్రీలు.. ఈ పండు సాగు భలే బాగుందంటున్న రైతులు

ప్రకృతి సుందర అందాల అల్లూరి మన్యం.. మధుర ఫలాల సాగుకు అనుకూలంగా మారుతుంది. ఇక్కడి శీతల వాతావరణం.. నేలలు ఆదాయాన్ని సమకూర్చే ఫ్రూట్స్ పంటలకు కలిసొస్తున్నాయి. ఇప్పటికే హిమాలయాల్లో పండే యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ పంటలో సక్సెస్‌ఫుల్‌గా సాగు అవుతుంటే.. ఇప్పుడు నోరూరించే స్ట్రాబెర్రీ సాగు గిరి రైతులకు సిరుల పంట పండిస్తోంది. అమెరికాలో పుట్టి ఆంధ్ర కాశ్మీరంలో.. సిరులు కురిపిస్తున్న స్ట్రాబెరీ పంటపై ఓ రిపోర్ట్..

Vizag: ఆంధ్రా కాశ్మీరంలో విరివిగా కాస్తున్న స్ట్రాబెర్రీలు.. ఈ పండు సాగు భలే బాగుందంటున్న రైతులు
Lambasingi Strawberries
Follow us

|

Updated on: Dec 09, 2022 | 3:58 PM

అమెరికాలో పురుడు పోసుకున్న లవ్ ఫ్రూట్.. స్ట్రాబెరీ పంట ఇప్పుడు మన చెంతే విరగ్గాస్తోంది. ఆంధ్రా కాశ్మీర్‌గా ప్రసిద్ధి చెందిన లంబసింగిలో గిరి రైతులు విజయవంతంగా ఈ పంటను సాగుచేస్తున్నారు. ఈ సీజన్ లో స్ట్రాబెర్రీ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.  గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీని మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అధికంగా సాగుచేస్తున్నారు. రుచి, పరిమాణం, ఆకారం ఆధారంగా 500పైబడిన రకాలున్నాయి. లంబసింగి ప్రాంతంలో ‘వింటర్‌ డాన్‌’ అనే రకాన్ని రైతులు సాగుచేస్తున్నారు. స్ట్రాబెర్రీ మొక్క దిగువ భాగంలో ఫలాలు వస్తాయి. బెర్రీలు నేలకు తగలకుండా మొక్కచుట్టూ ఎండు గడ్డి వేస్తారు. లేదా పరదాలు పరుస్తారు.

విశిష్టత కలిగిన స్ట్రాబెర్రీ సాగుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ జిల్లా వాతావరణం అనుకూలంగా మారింది. 1995లో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి లంబసింగి అటవీ ప్రాంతం.. స్ట్రాబెరీ సాగుకు అనుకూలమని నిర్ధారించారు. మొదటి సారి సాగులోనే మంచి ఫలితం రావడంతో ఇక ఈ ఫలం సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. చింతపల్లి మండలం లంబసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొందిపాకలు గ్రామానికి చెందిన రైతు ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారి స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. 2008లో పుణె నుంచి స్ట్రాబెర్రీ మొక్కలను దిగుమతి చేసుకుని ఎకరం విస్తీర్ణంలో నాటారు. అయితే మొదట్లో నీటి సదుపాయం లేకపోవడంతో పెట్టుబడి కూడా సరిగా రాలేదు. అయినా అనుకూలమైన వాతావరణంలో స్ట్రాబెర్రీ సాగుపై నమ్మకం పెట్టుకున్న ఆ రైతు.. సాగు కొనసాగిమాచాడు. ఇప్పుడు లాభల పంట పందితున్నారు. 2019 నవంబరులో రెండు ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు చేపట్టిమంచి లాభాలను అర్జించారు.

లంబసింగిలో నాలుగేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. రైతు కుశలవుడుని ఆదర్శంగా తీసుకుని కొంత మంది మైదాన ప్రాంత రైతులు లంబసింగి పరిసర ప్రాంతాల్లో భూములను లీజుకు తీసుకుని 2018 నుంచి స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. 2020 నుంచి స్థానిక గిరిజన రైతులు కూడా స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించారు. ప్రస్తుతం లంబసింగి, రాజుపాకలు, గొందిపాకలు, సిరిపురం, లబ్బంగి, చీకటిమామిడి, చిట్రాళ్లగొప్పు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు.  లంబసింగి పరిసర ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న స్ట్రాబెర్రీలను పర్యాటకులే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు నవంబరు మొదటి వారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. రైతులు పండించిన స్ట్రాబెర్రీల్లో 80 శాతం స్థానికంగానే అమ్ముడవుతుండగా, మిగిలిన 20 శాతాన్ని మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు.

లంబసింగి ప్రాంతంలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. స్థానికంగానే 200 గ్రాములు వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో ఐదేళ్లగా గిరిజన, కౌలు రైతులు స్ట్రాబెర్రీ సాగు చేస్తున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో పండే స్ర్టాబెర్రీ పంటను ఈ ప్రాంతం సందర్శనకు వచ్చే పర్యాటకులు కొనుగోలు చేస్తుండడంతో రైతులకు మార్కెటింగ్‌ సమస్య తలెత్తడంలేదు. ఈ ఏడాది లంబసింగి పరిసర ప్రాంతాల్లో సుమారు 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ వేశారు. కొద్ది రోజుల నుంచి పండ్లు పక్వానికి రావడంతో రైతులు కోయడం ప్రారంభించారు. లంబసింగి జంక్షన్‌, లంబసింగి, రాజుపాకలు, చిట్రాళ్లగొప్పు గ్రామాల వద్ద రహదారికి ఇరువైపులా స్టాల్స్‌ ఏర్పాటుచేసి విక్రయిస్తున్నారు. 200 గ్రాముల చొప్పున పండ్లను ప్యాకింగ్‌ చేసి ఒక్కో ప్యాకెట్‌ను వంద చొప్పున అమ్ముతున్నారు. లంబసింగి సందర్శనకు వస్తున్న పర్యాటకులు స్ట్రాబెర్రీ తోటల వద్దకు వెళ్లి తాజా పండ్లను కొనుగోలు చేస్తున్నారు.

అల్లూరి మన్యంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం స్టాబెర్రీకి అనుకూల వాతావరణం. ఎకరానికి 20 నుండి 22వేల మొక్కలను నాటుకోవాలి. దిగుబడి 8 నుండి 10 టన్నుల వరకు పంట వస్తుంది. స్టాబెర్రీ చాలా సున్నితంగా ఉంటుంది. నేల ద్వారా సంక్రమించే తెగుళ్లపై జాగ్రత్తలు పాటిస్తే.. మరింత నాణ్యమైన దిగుబడి వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.  మీరు ఎప్పుడైనా లంబసింగి ఏజెన్సీకి ఈ సీజన్లో వెళ్లినట్టు అయితే.. తాజాగా లభించే ఈ మధుర ఫలాన్ని ఆరగించి… ఆ మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోండి.

—-ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్ 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో