Hyderabad: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌ వేదికగా టీమిండియా మ్యాచ్‌లు.. ఎప్పుడంటే?

ఐపీఎల్‌  ప్రారంభమయ్యే వరకు టీమిండియా బిజిబిజీగా గడపనుంది. ఈ మూడు నెలల కాలంలో టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది బీసీసీఐ. మ్యాచ్ లు జరిగే తేదీలను, వేదికలను ప్రకటించింది.

Hyderabad: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌ వేదికగా టీమిండియా మ్యాచ్‌లు.. ఎప్పుడంటే?
Ind Vs Aus
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2022 | 3:10 PM

ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో బిజిబిజీగా ఉంది భారత జట్టు. వన్డే సిరీస్‌ పూర్తైన వెంటనే టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. బంగ్లా సిరీస్ పూర్తైన మరో మూడు నెలల పాటు స్వదేశంలోనే శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో వరుసగా మ్యాచ్‌లు ఆడనుంది. మొదటగా లంకేయులతో మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల్లో ఆడనుంది. ఇక ఆస్ట్రేలియాతో 4 టెస్టులు, మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ఐపీఎల్‌  ప్రారంభమయ్యే వరకు టీమిండియా బిజిబిజీగా గడపనుంది. ఈ మూడు నెలల కాలంలో టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది బీసీసీఐ. మ్యాచ్ లు జరిగే తేదీలను, వేదికలను ప్రకటించింది.

హైదరాబాద్‌, వైజాగ్‌లలో..

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది బీసీసీఐ. కివీస్‌, ఆసీస్‌లతో మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసిన వేదికల్లో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలకు కూడా అవకాశం కల్పించింది. జనవరి 18వ తేదీన న్యూజిలాండ్ తో తొలి వన్డేకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక మార్చి 19వ తేదీన ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు వైజాగ్ ను వేదికగా ఎంపిక చేసింది బీసీసీఐ.

ఇవి కూడా చదవండి

టీమిండియా షెడ్యూల్ వివరాలివే..

 శ్రీలంక పర్యటన..

తేదీ మ్యాచ్ వేదిక
జనవరి 3 1వ టీ20 ముంబై
జనవరి 5 2వ టీ20 పూణే
జనవరి 7 3వ టీ20 రాజ్‌కోట్
జనవరి 10 1వ వన్డే గౌహతి
జనవరి 12 2వ వన్డే కోల్‌కతా
జనవరి 15 3వ వన్డే త్రివేండ్రం
న్యూజిలాండ్ టూర్..
తేదీ మ్యాచ్ వేదిక
జనవరి 18 1వ వన్డే హైదరాబాద్
జనవరి 21 2వ వన్డే రాయ్పూర్
జనవరి 24 3వ వన్డే ఇండోర్
జనవరి 27 1వ టీ20 రాంచీ
జనవరి 29 2వ టీ20 లక్నో
ఫిబ్రవరి 1 3వ టీ20 అహ్మదాబాద్

 ఆస్ట్రేలియా టూర్..

తేదీ మ్యాచ్ వేదిక
ఫిబ్రవరి 9-13 1వ టెస్ట్ నాగపూర్
ఫిబ్రవరి 17-21 2వ టెస్ట్ ఢిల్లీ
మార్చి 1-5 3వ టెస్ట్ ధర్మశాల
మార్చి 9-13 4వ టెస్టు అహ్మదాబాద్
మార్చి 17 1వ వన్డే ముంబై
మార్చి 19 2వ వన్డే వైజాగ్
మార్చి 22 3వ వన్డే చెన్నై

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..