PAK vs ENG: పాక్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. ఇంగ్లండ్‌ టీమ్‌ హోటల్‌ సమీపంలోనే ఘటన.. క్రికెటర్లకు భద్రత పెంపు

శుక్రవారం (డిసెంబర్‌ 9) నుంచి ముల్తాన్‌లో రెండో టెస్ట్‌ జరగుతోంది. అయితే ఈ టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు ముల్తాన్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్‌కు సమీపంలో కాల్పలు కలకలం రేపాయి. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఉన్న హోట‌ల్‌కు కేవలం కిలోమీట‌ర్ దూరంలో తుపాకీ కాల్పుల శ‌బ్దం వినిపించింది.

PAK vs ENG: పాక్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. ఇంగ్లండ్‌ టీమ్‌ హోటల్‌ సమీపంలోనే ఘటన.. క్రికెటర్లకు భద్రత పెంపు
Pak Vs Eng
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2022 | 4:21 PM

భద్రతాపరమైన కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌లో చాలా ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగడం లేదు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడిప్పుడే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు దాయాది దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఇక 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌లో అడుగుపెట్టింది ఇంగ్లిష్‌ జట్టు. ప్రస్తుతం అక్కడ టెస్ట్‌ సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో పాక్‌ జట్టు ఘోరంగా ఓటమిపాలైంది. శుక్రవారం (డిసెంబర్‌ 9) నుంచి ముల్తాన్‌లో రెండో టెస్ట్‌ జరగుతోంది. అయితే ఈ టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు ముల్తాన్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్‌కు సమీపంలో కాల్పలు కలకలం రేపాయి. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఉన్న హోట‌ల్‌కు కేవలం కిలోమీట‌ర్ దూరంలో తుపాకీ కాల్పుల శ‌బ్దం వినిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన న‌లుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానిక గ్యాంగ్ వార్‌ కారణంగానే కాల్పులు చోటుచేసుకున్నాయని పాక్‌ పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు ఇంగ్లండ్ క్రికెట్‌ జట్టుతో ఎలాంటి సంబంధం లేదని స్థానిక యంత్రాంగం ఇంగ్లీష్ జట్టుకు హామీ ఇచ్చిందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో, ఇంగ్లీష్ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా పాక్ భద్రతపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తోందని, ఈ సంఘటనతో తమ భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఏడు వికెట్లతో సంచలనం..

కాగా ఈ ఘటన తర్వాత, ఇంగ్లండ్ ఎటువంటి సమస్యలు లేకుండా ముల్తాన్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది. దీంతో ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నాయి. కాగా17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ జట్టు సెప్టెంబర్‌లోనే టీ20 సిరీస్‌ కోసం పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ కోసం వచ్చింది. రావల్పిండిలో జరిగిన మొదటి టెస్ట్‌లో, బెన్ స్టోక్స్ టీం పాకిస్తాన్‌ను 74 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇక ఈరోజు ప్రారంభమైన ముల్తాన్‌ టెస్టులో పాక్‌ బౌలర్లు జూలు విదిల్చారు. పర్యాటక జట్టును కేవలం 281 పరుగులకు కుప్పుకూల్చారు. ఆర్బార్‌ అహ్మద్‌ ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..