100పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
తెలంగాణలో మరో జిల్లాలో 100 పడకలతో కోవిడ్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు బుధవారం ఈ 100పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణలో మరో జిల్లాలో 100 పడకలతో కోవిడ్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు బుధవారం ఈ 100పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..కరోనా నియంత్రణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
సిద్దిపేటలో 100 పడకల కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. కోవిడ్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షించి వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు, అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో 100 పడకల కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులు ప్రారంభమై సేవలు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
సిద్దిపేటలో ఈ రోజు 100 పడకల కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించామని, దీనికి అనుబంధంగా మరో 20 పడకల ఐసీయూను కూడా ప్రారంభించామని చెప్పారు. అన్ని బెడ్లకు ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి,…వెంటిలేషన్ అవసరం ఉన్న పేషేంట్లకు కూడా ఇక్కడే వైద్యం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.