ఉస్మానియా ఆస్పత్రిలో భారీగా వర్షపు నీరు.. కొట్టుకుపోయిన పీపీఈ కిట్లు..

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలో వర్షపు నీరు చేరింది. అసలే కరోనా కాటేస్తున్న సమయంలో.. భీకర వర్షం కారణంగా ఆసుపత్రి పరిస్థితులనే మార్చివేసింది. వాన నీటికి తోడు డ్రైనేజీ నీరు పొంగి...

ఉస్మానియా ఆస్పత్రిలో భారీగా వర్షపు నీరు.. కొట్టుకుపోయిన పీపీఈ కిట్లు..
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 5:28 PM

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలో వర్షపు నీరు చేరింది. అసలే కరోనా కాటేస్తున్న సమయంలో.. భీకర వర్షం కారణంగా ఆసుపత్రి పరిస్థితులనే మార్చివేసింది. వాన నీటికి తోడు డ్రైనేజీ నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

అంతేకాదు.. కరోనా బాధితులు కూడా ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందికి ఇస్తున్న పీపీఈ కిట్లు వర్షానికి కొట్టుకుపోయాయి. వాటి దృశ్యాలు కొందరు తమ కెమెరాలో బంధించారు. వందేళ్ల నాటి ఆసుపత్రి కావడంతో.. బిల్డింగ్‌ పెచ్చులు కూడా ఊడిపడుతున్నాయి. ఆ ప్రాంతం డౌన్‌లో ఉండడంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీరు.. నేరుగా ఆసుపత్రిలోకి ప్రవేశిస్తోంది.

ఆసుపత్రిలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. వర్షపునీటిలో డ్రైనేజీ నీరు కూడా కలవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో డాక్టర్లు, పేషెంట్లు పడరాని పాట్లు పడుతున్నారు. బెడ్లు కూడా చాలా వరకు తడిసి ముద్దయ్యాయి. నీళ్లు బయటకు పోవడం కష్టతరంగా మారింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షంతో రోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

వర్షం కారణంగా రోగులకు వైద్యసేవలు కూడా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు డాక్టర్లు భయపడుతున్నారు. కరోనానే కాదు.. సీజనల్‌ వ్యాదులు ప్రబలే టైం కావడంతో.. రోగుల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో వైద్యం కోసం పేషెంట్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది.

Read More:

కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..