Visakhapatnam Church: ప్రార్థనలు మానేసి పాస్టర్ల ఫైటింగ్.. విశాఖ వెంకోజిపాలెం చర్చ్‌లో పరేషాన్..
Emmanuel Lutheran Church: విశాఖపట్నంలోని వెంకోజిపాలెం ఇమ్మానియేల్ లూధరన్ చర్చిలో కనిపించింది. మొదట్లో ప్రేయర్లు ప్రశాంతంగానే మొదలయ్యాయి. కానీ.. ప్రార్థనలు కొనసాగుతుండగానే..
ఆదివారం ప్రార్థనలు అక్కడ అదుపు తప్పాయి. ప్రభువు కోసం వేడుకోవడం మానేసి… ఒకరి మీద మరొకరు బూతుల పర్వం మొదలుపెట్టారు. ప్రేయర్‌కొచ్చిన వాళ్లంతా ఈ గొడవేంటి బాబూ అంటూ తలోదిక్కు పారిపోయారు. ఈ ఘటన విశాఖపట్నంలోని వెంకోజిపాలెం ఇమ్మానియేల్ లూధరన్ చర్చిలో కనిపించింది. మొదట్లో ప్రేయర్లు ప్రశాంతంగానే మొదలయ్యాయి. కానీ.. ప్రార్థనలు కొనసాగుతుండగానే రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చర్చి ఆజమాయిషీపై పాస్టర్ల మధ్య కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న వివాదం ఆదివారం పీక్స్‌కి చేరింది. అనధికారిక వ్యక్తులు చర్చిలో కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని ఓ వర్గం నిలదీసింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చినా ఫలితం లేదు. పోలీసుల ముందే చర్చిలో పెద్దఎత్తున వాదులాడుకున్నారు.
ఒకరి మీదొకరు చెయ్యి చేసుకునేదాకా వెళ్లింది వ్యవహారం. ప్రస్తుతం… ఈ చర్చి పాస్టర్ల కేసు కోర్టులో ఉంది. ఇదిలావుంటే.. ఒంగోలు JNB చర్చిలో కూడా యుద్ధం జరిగింది. ఎప్పటిలాగే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఒకే రోజు, ఒకే టైమ్‌లో ఇరువర్గాలు సెపరేట్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో గొడవ జరిగింది. ఒక వర్గం యూత్ రిట్రీట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటే, మరో వర్గం పోటీగా ఇంకో ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. దాంతో, రెండు వర్గాలు చర్చ్ ఆవరణలోనే బాహాబాహాకీ దిగాయి.
దాంతో, ఎప్పటిలాగే పోలీసుల ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఇరువర్గాలతో మాట్లాడి సర్దిచెప్పిన పోలీసులు, అన్నీ ప్రోగ్రామ్స్‌ను క్యాన్సిల్ చేసి వెనక్కి పంపేశారు. అయితే, శాంతికి, ప్రశాంతకు నిలయాలుగా ఉండాల్సిన క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఇలా అశాంతికి, గొడవలకు కేంద్రాలుగా మారడం, పరస్పరం దాడులు చేసుకోవడంపై జనం చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..