తూర్పుగోదావరి: భారీ వర్షానికి కుప్పకూలిన అన్నవరం కల్వర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని ఏజన్సీమండలం వి ఆర్ పురం , పిఠాపురం, గొల్లప్రోలులో విస్తారంగా వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని ఏజన్సీమండలం వి ఆర్ పురం , పిఠాపురం, గొల్లప్రోలులో విస్తారంగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలలు ఎగిసిపడుతున్నాయి. అటు, ఏజన్సీమండలం వి ఆర్ పురం మండల పరిధిలోని అన్నవరం గ్రామం వద్ద ఆర్ అండ్ బి ప్రధాన రహదారి లో వున్నకల్వర్టు సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీకుండపోతవర్షానికి వంతెన ఫిల్లర్స్ క్రిందిభాగంకూలీపోయింది.
ఏడతేరిపి లేకుండా కురుస్తున్న బారివర్షాల దాటికి ప్రమాధస్థాయి నిమించి వరద ఉధృతి కొనసాగుతుండటంతో రోడ్డు కొతకు గురికావడంతో అన్నవరం కల్వర్టు కూలి పోయింది. ఫలితంగా అటు చింతూరు విఆర్ పురం మధ్య రవాణా స్తంబించి పోయింది. ప్రజల రాకపోకలు నిలిచి పోయాయి. గత ఏడాదినుంచి అన్నవరం కల్వర్టు క్రుంగి వున్నా ప్రమాదపు అంచున వున్నా సంబందిత శాఖ అధికారులు పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా కల్వర్టు కోతకుగురై కూలిపోయిందని మండలప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రాహదారిలో కూలిన కల్వర్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టి, రవాణా సౌకర్యం కల్పించాలని గిరిజనులు మండల ప్రజలు కోరుతున్నారు.