AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక

విశాఖ తెన్నేటి పార్క్ సమీపంలో భారీ నౌక ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. వాయుగుండం ప్రభావంతో గత రాత్రి సముద్రంలో గాలుల తాకిడికి ఈ నౌక ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లు తెలుస్తుంది.

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2020 | 1:14 PM

Share

విశాఖ తెన్నేటి పార్క్ సమీపంలో భారీ నౌక ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. వాయుగుండం ప్రభావంతో గత రాత్రి సముద్రంలో గాలుల తాకిడికి ఈ నౌక ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లు తెలుస్తుంది. విషయం తెలిసిన నగరవాసులు భారీ నౌకను ఆసక్తిగా చూస్తున్నారు.

వాయుగుండం ప్రభావంతో గత రాత్రి గాలితీవ్రత ఎక్కవగా ఉండటంతో నౌక ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన నౌక… పార్క్‌ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నుల మధ్య చిక్కుకోగా.. నౌకలో ఉన్న 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ ధ్వంసం కావడంతో సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

మరోవైపు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరబాద్‌లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తీరం వెంబడి గంటకు 55-75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్