AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవి నిండా విరబూసిన కృష్ణ కిరీటాలు.. నెల రోజులైనా వాడని పూలు.. ఆ సొగసు చూడతరమా..!!

కృష్ణ కిరీటం పూలకు శాస్త్రీయ నామం క్లిరో డెండ్రం పానిక్యులేటమ్. ఈ పూలు వర్షాకాలం శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వేసవిలో అడపాదనలు ఉంటాయి. సాధారణంగా ఈ పూలకు జూన్ నుంచి ఆగస్టు వరకు సీజన్. అయితే ముందస్తు వర్షాలు కురిస్తే అక్కడక్కడ ఇది పుష్పిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి.

అడవి నిండా విరబూసిన కృష్ణ కిరీటాలు.. నెల రోజులైనా వాడని పూలు.. ఆ సొగసు చూడతరమా..!!
Krishnas Crown
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Apr 12, 2025 | 8:40 PM

ఏజెన్సీ అనగానే ప్రకృతి అందాలకు కొదువ ఉండదు.. పచ్చటి అడవి.. ఎత్తైన కొండలు.. లోతైన లోయలు.. కొండల నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. రకరకాల చెట్లు చేమలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ప్రకృతి అందాలు వర్ణించలేనివి. ఆ అడవిలో ఉండే చెట్లలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత. ఒక్కో సీజన్లో కొన్ని పుష్పిస్తాయి.. మరికొన్ని పుష్పించి ఫలాలనిస్తాయి.. అటువంటి ప్రకృతిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు మరి. ఇప్పుడు ఏజెన్సీలో అక్కడక్కడ కృష్ణ కిరీటం పూలు కనువిందు చేస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా.. కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీలో నారింజ ఎరుపు వర్ణంలో కనిపిస్తున్నాయి ఈ పుష్పాలు. వాటి ప్రత్యేకత ఏంటంటే.. చిన్నచిన్న పూలతో ఒకే దగ్గర ఒకేసారి పుష్పించి కనువిందు చేస్తూ ఉంటాయి. గుత్తులు గుత్తులుగా కనిపిస్తూ.. చిన్నచిన్న పూలతో కలిపి ఒకే చోట భారీ ఆకారంలో కనిపిస్తాయి. ఈ పూలు.. ఒకే చోట గుర్తుగా పుష్పిస్తూ కిరీటం ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని కృష్ణ కిరీటం పూలు అని పిలుస్తూ ఉంటారు. దీని ఆకారం పిరమిడ్ లాక్ కూడా కనిపిస్తూ ఉంటుంది.. ఆరెంజ్ టవర్ ఫ్లవర్స్ అని కూడా వాటిని పిలుచుకుంటూ ఉంటారు.

కృష్ణ కిరీటం పూలకు శాస్త్రీయ నామం క్లిరో డెండ్రం పానిక్యులేటమ్. ఈ పూలు వర్షాకాలం శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వేసవిలో అడపాదనలు ఉంటాయి. సాధారణంగా ఈ పూలకు జూన్ నుంచి ఆగస్టు వరకు సీజన్. అయితే ముందస్తు వర్షాలు కురిస్తే అక్కడక్కడ ఇది పుష్పిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నెల రోజుల వరకు వాడని పూలు..

ఎరుపు, నారింజ వర్ణంలో మేఘన గాలాడుతూ కనువిందు చేసే ఈ కృష్ణ కిరీటం పూలకు ఓ ప్రత్యేకత ఉంది. ఒకసారి పుష్పిస్తే నెల రోజుల వరకు వాడిపోకుండా ఉంటాయి. ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి. ఈ మొక్కకు ఆకులు పెద్దవిగాను ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అంతేకాదు.. ప్రత్యేక ఔషధ గుణాలు కూడా ఈ మొక్కలకు ఉంటాయట. ఈ మొక్కలో ఉష్ణ మండల ఆసియా దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక పూల గుత్తిలో వందలాది పువ్వులు పుష్పిస్తాయి. ఎండ, కాంతిలో ఈ పువ్వు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సీతాకోకచిలుకలను అమితంగా ఆకర్షిస్తుంది ఈ పూలు. ఏజెన్సీలో అక్కడక్కడ ఈ పూలు దర్శనమిస్తుండడంతో ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రయాణికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..