AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

విద్యార్థి నేతల కిడ్నాప్‌ ఘటనలో మోహన్‌బాబు, మంచు విష్ణుపై కేసు నమోదైంది. కాలేజీలో జరుగుతున్న అక్రమాలు బయటపెడితే.. కిడ్నాప్‌ చేస్తారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. అయితే యాజమాన్యాన్ని డబ్బు డిమాండ్‌ చేశారని యూనివర్సిటీ PRO పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..
Manchu Vishnu - Mohan Babu
Ram Naramaneni
|

Updated on: Feb 03, 2026 | 10:06 PM

Share

తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్‌బాబు, మంచు విష్ణు, పీఆర్వో సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్‌ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమవుతుండగా.. ఇద్దరు విద్యార్థి నేతలను మోహన్‌బాబు యూనివర్శిటీ  బౌన్సర్లు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. SFI నేతలు అక్బర్, వినోద్‌ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని.. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్‌ చేయించిందని పోలీసులకు CPM నేతలు ఫిర్యాదు చేశారు. అడిషనల్‌ SP ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కిడ్నాపర్ల కారును మోహన్ బాబు యూనివర్సిటీ వరకు చేజింగ్ చేశారు. చివరికి నారావారి పల్లె దగ్గర ఉన్న మోహన్‌బాబు ఫాంహౌస్‌లో నిందితులతో పాటు కిడ్నాప్ గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు గుర్తించారు. తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ దగ్గర విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. కాలేజీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు బయటపెడితే కిడ్నాప్‌ చేస్తారా.. మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పుతున్నారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు.

మరోవైపు వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో దుష్ర్రచారం చేశారని విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ పీఆర్వో సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యాన్ని డబ్బు కూడా డిమాండ్‌ చేశారన్నారు. దీంతో విద్యార్థి సంఘం నేత అక్బర్‌తో పాటు మరికొందరిపై చంద్రగిరి పీఎస్‌లో కేసు నమోదైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!