భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!
ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ త్వరలో టేకాఫ్ తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. అసలు భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓవరాల్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ త్వరలో టేకాఫ్ తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. అసలు భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓవరాల్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జెట్ స్పీడ్ తో పనులు సాగుతూ మరికొద్ది నెలల్లో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తూ భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో పదిహేను నెలల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి విమానాలను రన్ వే దూసుకుపోయేలా రాష్ట్ర ప్రభుత్వం పనులను పరుగులు పెట్టిస్తోంది.
కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు…తరచు భోగాపురం వచ్చి ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణానికి అటు కేంద్రం నుంచి రావాల్సిన సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. ఇక సమీప గ్రామాలకు చెందిన రైతులు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. తమ గ్రామాలకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. వాళ్లకు ఇబ్బంది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. పనుల్లో వేగం పెరిగిందని, అన్ని వసతులతో కూడా ఎయింర్‌పోర్టు అనుకున్న సమయానికంటే ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని
భారీ యంత్రాలతో వందలాది లారీలు, వేలాది మంది కార్మికులతో నిర్మాణం సాగుతుంది. ఇప్పటివరకు సుమారు 71 శాతం పనులు పూర్తి చేసింది నిర్మాణ సంస్థ.. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ టెండర్ దక్కించుకున్న జీఎంఆర్ సంస్థ పనులు దూకుడుగా చేస్తోంది. ఇప్పటివరకు ఎయిర్‌పోర్టులో నూటికి నూరు శాతం ఎర్త్ పనులు పూర్తి కాగా, కీలకమైన రన్ వే పనులు 97 శాతం, ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ పనులు 72 శాతం, టెర్మినల్ పనులు 60 శాతం, ట్యాక్సీ వే 92 శాతం, పిటూబి 55 శాతం, ఇతర బిల్డింగ్స్ 43 శాతం పనులు అయ్యాయి.
అంతే కాకుండా ఎయిర్ పోర్ట్ కు కావాల్సిన గ్రీనరీ తో పాటు ఇతర సుందరీకరణ పనుల పై కూడా దృష్టి సారించింది నిర్మాణ రంగ సంస్థ. ఎయిర్ పోర్ట్‌కు తాత్కాలికంగా కావలసిన 2500 కెవి విద్యుత్ ఏర్పాట్లు కూడా చేశారు విద్యుత్ శాఖ అధికారులు. ప్రస్తుతానికి ఎయిర్ పోర్ట్ పనులకు కావాల్సిన 1.7 మెట్రిక్ లీటర్ల నీటిని తాత్కాలికంగా అందిస్తున్నారు జిల్లా అధికారులు. భవిష్యత్తులో భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సుమారు 5 మెట్రిక్ లీటర్ల నీరు అవసరం ఉన్న నేపథ్యంలో అందుకోసం కూడా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఎయిర్ పోర్ట్ కు శాశ్వత ప్రాతిపదికన కావాల్సిన నీటిని తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ నుండి ఇవ్వాల్సి ఉంది. అయితే సుదీర్ఘకాలం పాటు తారక రామ తీర్థ సాగర్ పనులు పెండింగ్ లో ఉండటంతో ఇప్పుడు ఆ పనులను కూడా యుద్ధప్రాతిపదికన ప్రారంభించి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలోపే పనులు పూర్తి చేసి ఎయిర్ పోర్ట్ కు నీటిని అందించేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం రూ. 800 కోట్లు నిధులు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
పనుల్లో ఇదే జోరు కొనసాగితే నిర్ణీత సమయంలోపు అంటే మరో 15 నెలలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఇటు విశాఖకు, అటు శ్రీకాకుళం జిల్లాకు మధ్యలో ఉండటంతో ఉత్తరాంధ్ర అభివృద్దికి మణిహారంగా మారనుంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికుల సౌకర్యంతోపాటు కార్గో కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి ఏటా 4,400 టన్నుల సరుకు, సగటున 28 లక్షల మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు.
వాస్తవంగా విశాఖ నుంచి ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ఎయిర్ పోర్టు భారత నావికాదళానికి సంబంధించినది కావడంతో విమాన రాకపోకలపై అనేక ఆంక్షలు ఉన్నాయి. అయితే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఎలాంటి ఆంక్షలు అందకపోవడంతో పాటు 24 గంటలు విమాన సర్వీసులు అందనున్నాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలతోపాటు కార్గో సేవలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తొలి విడతగా 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యం తో పాటు కార్గో రాకపోకలు కూడా పెరగనున్నాయి.. అంతేకాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం కావటంతో ఇక్కడ నుండి ఇతర దేశాలకు సైతం రాకపోకలు జరగనున్నాయి.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..