AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పురాతన బావిలో పూడికతీత.. కనిపించింది చూసి పులకించిన గ్రామస్తులు..

చేయి చేయి కలిపారు.. తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు నడుం బిగించారు. పూడిక చేరి శిథిలావస్థకు చేరుకున్న పురాతన బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఓ అందమైన పురాతన బావి బయటపడింది. దీంతో గ్రామస్తులు సంకల్పం కూడా నెరవేరింది.. అందమైన పురాతనమైన బావిలో ప్రాచీన శిలాశాసనం కూడా ప్రత్యక్షమైంది.. ఇది ఎక్కడో కాదు.. ఏపీలోని..

Andhra News: పురాతన బావిలో పూడికతీత.. కనిపించింది చూసి పులకించిన గ్రామస్తులు..
Nandipadu Well
Follow us
J Y Nagi Reddy

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 12, 2025 | 2:08 PM

చేయి చేయి కలిపారు.. తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు నడుం బిగించారు. పూడిక చేరి శిథిలావస్థకు చేరుకున్న పురాతన బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఓ అందమైన పురాతన బావి బయటపడింది. దీంతో గ్రామస్తులు సంకల్పం కూడా నెరవేరింది.. అందమైన పురాతనమైన బావిలో ప్రాచీన శిలాశాసనం కూడా ప్రత్యక్షమైంది.. ఇది ఎక్కడో కాదు.. ఏపీలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు అనే గ్రామంలో జరిగింది. కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలోని చౌడేశ్వరి దేవి ఆలయం ముందున్న పురాతన బావి ఒకప్పుడు ఊరందరి తాగునీటి అవసరాలు తీర్చేది. కాలక్రమేన ఆ బావి శిలావస్థకు చేరుకుని పూడికతో నిండిపోయింది.

అయితే.. ఇటీవల గ్రామంలో తాగునీటికి కొరత ఏర్పడింది. దీంతో గ్రామస్తులకు ఒక ఆలోచన వచ్చింది. బావిలోని పూడిక తీస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు, నీటి అవసరాలు తీరుతాయని ఆ గ్రామస్తులు అందరూ కలిసి పూడికతీత పనులు చేపట్టారు. బావి బయట ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా పూడిక తీత పనులు చేపట్టారు. అలా కొన్ని రోజులకు మట్టిలో కురుకుపోయిన ఒక అద్భుతమైన పురాతన బావి కట్టడం బయటపడింది.

బయటపడ్డ శిలాశాసనం

బావి పూడికతీత పనుల్లో ఒక బండ రాయిపై రాసి ఉన్న శిలాశాసనం కూడా బయటపడింది. సంస్కృతంలో రాసి ఉన్న ఈ శిలా శాసనం చౌడేశ్వరి ఆలయం చరిత్రను తెలిపేలా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు పురావస్తు శాఖ అధికారులు. ఈ అద్భుతమైన బావి, అలాగే శాసనం గురించి పరిశోధన చేసి.. బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..