AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో కొత్త కార్యక్రమం.. రైతులందరికీ బెనిఫిట్

రైతులకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం త్వరలో మరో కొత్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది. ఆర్గానిక్ వ్యవసాయం ఇటీవల ట్రెండ్ అవుతున్న క్రమంలో దాని ద్వారా రైతులు ఎక్కువ ఆదాయం సంపాదించేలా ప్రభుత్వం సహాయపడనుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

Andhra Pradesh: ఏపీలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో కొత్త కార్యక్రమం.. రైతులందరికీ బెనిఫిట్
Farmers
Venkatrao Lella
|

Updated on: Feb 04, 2026 | 8:18 AM

Share

ఏపీలోని రైతులకు లబ్ది చేకూర్చేలా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు. తాజాగా సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్‌పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్గానిక్ వ్యవసాయంలో ఏపీని టాప్‌లో నిలపడంలో భాగంగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని  రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా పలు సదుపాయాలు ప్రభుత్వం కల్పించనుంది. రైతులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పండించినవాటిని సులువుగా విక్రయించుకునేలా ప్రభుత్వం సహాయపడనుంది.

ఆర్గానిక్ ఫార్మింగ్‌కు సర్టిఫికేషన్

ఏపీ ప్రభుత్వం త్వరలో ఆర్గానిక్ వ్యవసాయం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. తొలుత రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చిన 18 లక్షల మంది రైతులకు సహకారం అందించనున్నారు. రైతులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తుల నాణ్యత అందరికీ తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాదుపాయం ప్రభుత్వమే అందించనుంది. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇక రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి..? ఎలా రాబడి పొందాలి? అనే దానిపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అలాగే వాటిని మార్కెట్‌లో విక్రయించుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా పెరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.

వాటి నమోదు తప్పనిసరి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆక్వా సాగు చేసేవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అటు పాల్ట్రీ రంగంలో ఉన్న రైతులకు ప్రభుత్వం సహాయం అందించనుంది. అందులో భాగంగా అంగన్వాడీలకు అవసరమైన గుడ్లను పాల్ట్రీ రైతులు సరఫరా చేసేలా కాంట్రాక్ట్‌లు ఇవ్వనున్నారు. ఇక ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. స్వానిక గిరిజనుల భాగస్వామ్యంతో కుంకుమ పువ్వు సాగుపై నివేదికలు సిద్దం చేయాలని సూచించారు. పీపీపీ పద్దతిలో సాగు చేస్తే లాభం ఉంటుందన్నారు. అటు ఎల్‌నీవో ప్రభావం నుంచి రైతులను బయటపడేసేందుకు వర్షాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

Follow Us