Corona Tests: ఏపీలో 50లక్షలు దాటిన కరోనా టెస్ట్‌ల సంఖ్య

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ మరో రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని పరీక్షల సంఖ్య 50లక్షలను దాటేసింది.

Corona Tests: ఏపీలో 50లక్షలు దాటిన కరోనా టెస్ట్‌ల సంఖ్య
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2020 | 9:01 AM

Corona Tests AP: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ మరో రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని పరీక్షల సంఖ్య 50లక్షలను దాటేసింది. శనివారం నాటి పరీక్షలతో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 50,33,676కు చేరింది. మిలియన్‌ జనాభాకు 94,264 మందికి టెస్ట్‌లు జరిగాయి. ఇక రికవరీ రేటులోనూ ఏపీ దూసుకుపోతోంది. 85.91 శాతం రికవరీతో ఏపీ దేశంలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. అలాగే మరణాల రేటు కూడా తగ్గుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు నమోదయ్యే నాటికి ఒక్క ల్యాబొరేటరీ కూడా లేకపోగా.. ఆ తరువాత సాంకేతిక వనరులను సమకూర్చుకుని, పడకలు ఏర్పాటు చేసి లక్షలాది మందిని కరోనా నుంచి కాపాడగలిగారు. మరోవైపు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి.

ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. అందులో 81,763 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,30,711 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5302కి చేరుకుంది.

Read More:

ఏపీ సీఎం సహాయనిధి నుంచి రూ.112కోట్లు కొల్లగొట్టే కుట్ర.. రంగంలోకి పోలీసులు

Bigg Boss 4: ప్రతి ముగ్గురిలో ఇద్దరు షోను చూస్తున్నారట