AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ: కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు, 58 మరణాలు

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8218 పాజిటివ్ కేసులు, 58 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది.

ఏపీ: కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు, 58 మరణాలు
Ravi Kiran
|

Updated on: Sep 19, 2020 | 7:00 PM

Share

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8218 పాజిటివ్ కేసులు, 58 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. వీటిల్లో 81,763 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,30,711 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5302కి చేరుకుంది. (Coronavirus In Andhra Pradesh)

అటు గడిచిన 24 గంటల్లో 10,820 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో 1071 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 477, చిత్తూర్ 736, గుంటూరు 471, కడప 520, కృష్ణ 468, కర్నూలు 319, నెల్లూరు 693, శ్రీకాకుళం 485, విజయనగరం 462, ప్రకాశంలో 670, విశాఖపట్నం 451 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 85,247 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 580 కరోనా మరణాలు సంభవించాయి.

Follow Us