ఏపీ సీఎం సహాయనిధి నుంచి రూ.112కోట్లు కొల్లగొట్టే కుట్ర.. రంగంలోకి పోలీసులు

ఏపీలో సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే కుట్రకు కొంతమంది యత్నించారు. అయితే బ్యాంక్ అధికారులు అప్రమత్తం అవ్వడంతో

ఏపీ సీఎం సహాయనిధి నుంచి రూ.112కోట్లు కొల్లగొట్టే కుట్ర.. రంగంలోకి పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2020 | 8:38 AM

AP CM Relief fund: ఏపీలో సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే కుట్రకు కొంతమంది యత్నించారు. అయితే బ్యాంక్ అధికారులు అప్రమత్తం అవ్వడంతో ఈ కుంభకోణం బయటపడింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలోని మూడు బ్యాంకుల ద్వారా నగదును మార్చుకునేందుకు దుండగులు ప్రయత్నం చేశారు. భారీ మొత్తం కావడంతో ఆయా బ్యాంకులు వెలగపూడిలోని ఎస్బీఐని సంప్రదించాయి. దీంతో మోసం బయటపడగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.

బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్‌బద్రి శాఖ నుంచి రూ.52.65 కోట్ల చెక్కు డ్రా .. ఢిల్లీలోని సీసీపీసీఐ కి రూ.39.89 కోట్ల చెక్కు డ్రా.. కోల్‌కత్తా సర్కిల్‌లోని మోగ్‌రాహత్‌ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కు డ్రా చేసేందుకు యత్నించారు. మూడు బ్యాంకుల్లో క్లియరెన్స్ కోసం దుండగులు చెక్కులను సమర్పించారు. ఈ మూడు చెక్కులు విజయవాడ ఎంజీ రోడ్‌లో ఉన్న బ్రాంచ్‌కు చెందినట్లుగా గుర్తించారు. చెక్కులపై సీఎంఆర్‌ఎఫ్, రెవెన్యూ శాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్‌ అన్న స్టాంప్‌పై సంతకం ఉంది. క్లియరెన్స్‌ కోసం ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తా సర్కిళ్లకు చెందిన ఆయా బ్యాంకుల అధికారులు ఇక్కడికి ఫోన్‌ చేయడంతో కుట్ర బయటపడింది. ఈ క్రమంలో దీనిపై లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More:

Bigg Boss 4: ప్రతి ముగ్గురిలో ఇద్దరు షోను చూస్తున్నారట

Bigg Boss 4: గంగవ్వ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌