మీ పనితీరు బావుంది: ప్రకాశం జిల్లా అధికారులకు జగన్ ప్రశంస
ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం పని తీరు బావుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కితాబిచ్చారు. పత్తి సాగును ఎర్ర రేగడికి కాకుండా నల్లరేగడి నేలకే
CM YS Jagan: ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం పని తీరు బావుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కితాబిచ్చారు. పత్తి సాగును ఎర్ర రేగడికి కాకుండా నల్లరేగడి నేలకే పరిమితం చేసేలా ప్రకాశం జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు. అలాగే బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేసేల రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్.. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటులో ప్రకాశం జిల్లా యంత్రాంగం పనితీరు బావుందని తెలిపారు.
అంతేకాదు బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు, ఇళ్ల పట్టాల కోసం స్థలాల గుర్తింపు విషయంలోనూ జిల్లా అధికారులు చక్కటి పనితీరు కనబరుస్తోందని జగన్ అన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు–నేడు పథకాల కింద పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. నాడు-నేడుకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అక్టోబర్ మొదటి వారంలో చెల్లిస్తామని జగన్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభాన్ని అక్టోబర్ 5 నుంచి నవంబర్ 2కు వాయిదా వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు జగన్ వెల్లడించారు.
Read More:
వరద నీటిలో కొట్టుకుపోయిన శర్వానంద్ తాత, మాజీ అణు శాస్త్రవేత్త ఇల్లు
వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్.. చిన్న సైజ్ తుంపర్లతోనూ కరోనా వ్యాప్తి