Vizag Steel Privatisation : ఉక్కుపరిశ్రమలకు అవసరమయ్యే కోకింగ్ కోల్ దేశంలో తగినంత లేదు : సాయిరెడ్డికి సెంటర్ ఆన్సర్
Pralhad Joshi : విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ అంశంపై రాజ్యసభ చర్చలో లేవనెత్తిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిచ్చారు...

Pralhad Joshi : విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ అంశంపై రాజ్యసభ చర్చలో లేవనెత్తిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిచ్చారు. దేశంలో ఉక్కు పరిశ్రమలు కోకింగ్ కోల్ కొరతను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. సొంత బొగ్గు గనులు లేక ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి వచ్చాయా..? అంటూ రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశంలో కోకింగ్ కోల్ కొరత కారణంగా ఉక్కు పరిశ్రమలు విదేశాల నుంచి కోల్ దిగుమతి చేసుకుంటన్నట్లు ఆయన వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్‌లలో తక్కువ బూడిద పరిణామం కలిగిన (లోయాష్) కోకింగ్ కోల్‌ను మాత్రమే వినియోగిస్తారని, మన దేశంలో శుభ్రపరచని కోకింగ్ కోల్‌లో బూడిద సగటున 22 నుంచి 35 శాతం ఉంటుంది. సాంకేతికంగాను, పర్యావరణ పరిరక్షణ పరంగాను స్టీల్ ప్లాంట్‌లలో వినియోగించే కోకింగ్ కోల్‌లో బూడిద 10 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలని కేంద్రమంత్రి తెలిపారు. అందుకే ఉక్కు కంపెనీలు తమకు అవసరమైన లోయాష్ కోకింగ్ కోల్‌ను అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని మంత్రి చెప్పారు. దేశంలో వివిధ స్టీల్ ప్లాంట్లకు ప్రభుత్వం కేటాయించిన సొంత బొగ్గు గనుల వివరాలను మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. 2015 లో గనులు, ఖనిజాల చట్టం సవరించిన అనంతరం ఇ-ఆక్షన్ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుగుతున్నట్లు చెప్పారు.
Read also : Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం, రాజ్యసభ చర్చలో తేల్చి చెప్పిన ఎంపీ విజయసాయి రెడ్డి