GVL Vs Perni: దేశాన్ని బాబాలు పాలిస్తున్నారన్న నాని.. రాష్ట్రంలో పాస్టర్ల ప్రభుత్వమే రావాలా? అని ప్రశ్నించిన జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర కేంద్రం ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంత్రి పేర్ని దేశాన్ని నాని బాబాలు పాలిస్తున్నారని
GVL counter – Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర కేంద్రం ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంత్రి పేర్ని దేశాన్ని నాని బాబాలు పాలిస్తున్నారని విమర్శలు చేయడం దారుణమని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ఆయన నిలదీశారు. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయమని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పాస్టర్ల ప్రభుత్వమే రావాలా? అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ.. కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రంలో పర్యటనలో ఉండగా మంత్రుల వ్యాఖ్యలు చేయటంపై మీ ఉద్దేశ్యం ఏంటి? అని జీవీఎల్ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం అమ్ జాద్ భాషా మళ్ళీ టిప్పుసుల్తాన్ భజన ఎందుకు చేస్తున్నారు? అంటూ జీవీఎల్ నిలదీశారు. దీని వెనుక కచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు.
వైసీపీ కుట్రలు చేస్తుందని చెప్పిన జీవీఎల్.. పబ్లిక్ ప్లేస్ లో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి వీలు లేదన్నారు. రాష్త్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక ధోరణి స్పష్టంగా కనపడతుందన్న ఆయన.. తెలుగుదేశం పార్టీ, వైసీపీ లాలూచీ రాజకీయం నడిపిస్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. “ఏపిలో నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలోని ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం జోక్యం చేసుకోదు.. కానీ పరిస్థితులు గాడి తప్పితే కచ్చితంగా కేంద్రం జోక్యం ఉంటుంది.” అని జీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు.
ఏపీలో అసలైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ అని.. టీడీపీ పద్ధతులనే వైసీపీ అవలంభిస్తోందా.. అని అడిగారు. టీడీపీలో దృశ్యం 2 నడిస్తే.. వైసీపీ పాలనలో గరుడ పురాణం 2 నడుస్తోందంటూ వ్యాఖ్యానించారు. గరుడ పురాణం 2 ఫ్లాప్ అవడం ఖాయమని ఆయన విశాఖలో మాట్లాడుతూ జోస్యం చెప్పారు.