ప్రాంతాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు

అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఇప్పటికే మూడు రాజధానుల నిర్మాణం దిశగా అడుగులు వేస్తోన్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రాంతాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు

Andhra Pradesh Government: అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఇప్పటికే మూడు రాజధానుల నిర్మాణం దిశగా అడుగులు వేస్తోన్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  అభివృద్ది కోసం ఇప్పటికే రాష్ట్రంలో 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా బీసీజీ గ్రూపు ప్రతిపాదించింది. అందులో భాగంగా  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ( ఉత్తరాంధ్ర).. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి ( గోదావరి డెల్టా)..  కృష్ణా, గుంటూరు ( కృష్ణా డెల్టా).. ప్రకాశం, నెల్లూరు (దక్షిణాంధ్ర).. కడప, చిత్తూరు ( ఈస్ట్‌ రాయలసీమ).. కర్నూలు, అనంతపురం ( వెస్ట్‌ రాయలసీమ)గా బీసీజీ గ్రూపు నిర్ణయించింది. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా ఈ ప్రాంతాల కుదింపు కూడా జరగొచ్చునన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీటినే ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికా బోర్డులకు ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు సమాచారం.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్‌.. టీవీ యాంకర్‌ ఆత్మహత్య

Click on your DTH Provider to Add TV9 Telugu