కేంద్రం సంచలన నిర్ణయం.. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్‌..

కేంద్రం సంచలన నిర్ణయం.. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్‌..

ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా అందించనున్నారు. గతవారం కేంద్ర కేబినేట్ ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020లో ఈ అంశాన్ని ప్రతిపాదించారు.

Ravi Kiran

|

Aug 03, 2020 | 1:57 PM

New Education Policy: ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా అందించనున్నారు. గతవారం కేంద్ర కేబినేట్ ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020లో దీన్ని ప్రతిపాదించారు. ఉదయాన్నే పోషకమైన అల్పాహారాన్ని పిల్లలకు అందించడం వల్ల వారి మేధోశక్తిని పెంపొందించవచ్చునని పేర్కొంది. అందువల్ల అల్పాహారం కోసం నిబంధనలను చేర్చడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని సిఫార్సు చేసింది.

”పిల్లలు పోషకాహార లోపం లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు సరిగ్గా చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నారు. కాబట్టే వారికి బలవర్ధమైన ఆహారాన్ని అందించాలి. ఉదయాన్నే పోషకమైన అల్పాహారం పిల్లలకు అందిస్తే వారి మేధోశక్తి పెరగడానికి తోడ్పడుతుందని అధ్యయనం చెబుతోంది. అందుకే ఇక నుంచి విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు శక్తినిచ్చే అల్పాహారాన్ని అందించాలి” అని పాలసీ పేర్కొంది.

ఇక వేడివేడి ఆహారం అందించలేని ప్రాంతాల్లో… బెల్లంతో పాటు ఉడికించిన వేరు శెనగ, చెన్నా లేదా పండ్లను అందించవచ్చునని సూచించింది. స్కూల్ విద్యార్ధులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని.. సంపూర్ణ టీకా విధానాన్ని కూడా పాటించాలని కేంద్రం తెలిపింది. అటు ప్రతీ విధ్యార్దికి హెల్త్ కార్డులను జారీ చేసి.. ఎప్పటికప్పుడూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుండాలని స్పష్టం చేసింది. కాగా, ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలు సన్నాహక తరగతి లేదా బాలవతికాకు వెళ్తారని నూతన విద్యా పాలసీ ప్రతిపాదించింది.

Also Read:

కొత్త లక్షణం: కరోనా సోకినవారిలో వినికిడి లోపం.!

జగన్ సంచలన నిర్ణయం.. నాలుగు జోన్లుగా ఏపీ విభజన.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu