బీటెక్ బాబుకు కిక్కెక్కింది.. కారుతో ఢీ కొట్టి పరుగో..! మూడు కిలోమీటర్ల చేజింగ్ ఆఖరికి ఊహించని క్లైమాక్స్
విశాఖలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో కారు బీభత్సం చేసిన యువకుడ్ని.. చేజ్ చేసి పట్టుకున్నరు మరికొంతమంది యువకులు. ఢీకొని ఆపకుండా పారిపోతున్న డ్రంకెన్ డ్రైవర్ను వెంబడించారు. లాసన్స్ బే కాలనీ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్లు వెంబడించి సిరిపురం దగ్గర పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసుల ఎంట్రీ ఇచ్చి యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చేజింగ్ చేస్తున్న..
విశాఖపట్నం, ఆగస్టు 6: అది విశాఖలోని రద్దీగా ఉండే ప్రాంతం. ఓ యువకుడు తప్ప తాగి కారు డ్రైవ్ చేశాడు. కుర్రాడికి కిక్కు ఎక్కింది.. కారు అదుపు తప్పింది. మరో యువకుడికి ఆ కారు తగిలింది. ఆపమంటే ఆ కారు ఆగలేదు… ఎక్సలేటర్ నొక్కి స్పీడ్ పెంచాడు. అక్కడే ఉన్న చుట్టుపక్కల కుర్రాళ్లు ఊరుకుంటారా.? కిక్కు లో కారు తొక్కుతున్న వాడి ఆట పట్టించేందుకు వాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంబడించారు. వాళ్లను చూసిన ఆ కిక్కులో కారు నడుపుతున్న యువకుడు మరింత స్పీడ్ గా పోనిచ్చాడు. ఈ క్రమంలో భారీ మధ్యలో మరికొందరిని ఢీకొట్టాడు. ఎట్టకేలకు మూడు కిలోమీటర్ల మీద చేసి వాడిని పట్టుకున్నారు. పోలీసుల ఎంట్రీ ఇచ్చి మద్యం మత్తులో ఉన్న యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో అంతా బయటపడ్డారు. కానీ ఎవరికైనా ఢీ కొంటే ప్రాణాలే పోయేవి..!
విశాఖలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో కారు బీభత్సం చేసిన యువకుడ్ని.. చేజ్ చేసి పట్టుకున్నరు మరికొంతమంది యువకులు. ఢీకొని ఆపకుండా పారిపోతున్న డ్రంకెన్ డ్రైవర్ను వెంబడించారు. లాసన్స్ బే కాలనీ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్లు వెంబడించి సిరిపురం దగ్గర పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసుల ఎంట్రీ ఇచ్చి యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చేజింగ్ చేస్తున్న సమయంలో బైక్ పై ఉన్న యువకులు వీడియో షూట్ చేయడంతో.. ఇప్పుడు ఆ చేజింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆ ఘటన మరువక ముందే..!
వీఐపీ రోడ్ లో తప్ప తాగి ఇన్నోవా బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే.. గత రాత్రి తప్ప తాగి కారు నడిపిన విగ్నేష్ అనే యువకుడు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనదారులను ఢీ కొన్నాడు. టెస్ట్ చేస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 242 రీడింగ్ చూపించండి. AP 39 SL 2425 EV కారుతో యువకుడ్ని అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. వెల్లూరు విట్స్ లో బీటెక్ చదువుతున్నడు విగ్నేష్. యువకుడు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కారు రాష్ డ్రైవింగ్ తో.. అద్దాలు పగిలాయి. కారు ధ్వంసం అయింది. మరికొందరి వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. కుర్రాడికి కారులో ఉన్న కిక్కు పోలీస్ స్టేషన్కు వెళ్లాక దిగినట్టయింది. ఈ చేజింగ్ కాస్త ఎంవిపి 3 టౌన్ పోలీస్ స్టేషన్ల లిమిట్స్ కావడంతో.. బాధితులు కూడా ఆయా పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అయిందేదో అయిపోయింది అంటూ కాళ్లబెరానికి వచ్చాడట సదరు ఆ మత్తులో కారు నడిపిన యువకుడు. మొత్తం మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కారు కేసులు ఈ మధ్యకాలంలో పెరుగుతుండడంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కు సిద్ధమవుతున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.