మూడు లక్ష్యాలతో ఈ వాక్ నిర్వహించినట్లు జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, విశాఖ కార్పొరేటర్ ఉష శ్రీ తెలిపారు. 1. పాశ్చాత్య దుస్తులను అమితంగా ప్రేమించే యువతులలో చీర కట్టు పట్ల ఆసక్తిని పెంచండం, ప్రోత్సహించడం. 2. కోవిడ్ కారణంగా చితికి పోయిన చేనేత జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపాలంటే హాండ్ లూం శారీ లను ప్రోత్సహించడం. 3. చీరలో నడవడం కష్టమనుకునే వాళ్లకు ఈ 30 నిమిషాల వాక్ ద్వారా వాళ్ళ ఫిట్నెస్ ను పెంపొందించే విధంగా ప్రోత్సహించడం.