Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్.. ఆంధ్రా మెడికల్ కాలేజీలోనీ ఆ అస్థిపంజరాల వయసు 200 ఏళ్లు..! నమ్మలేకపోతున్నారా..? అయితే ఇది చదవాల్సిందే..

Andhra Medical College, Vizag: సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశాఖపట్నం లోని ఆంధ్రా వైద్య కళాశాల ఎన్నో చారిత్రక విశేషాలకు కేంద్ర బిందువు లాంటిది. విద్యార్థులకు వైద్య శాస్త్రం పై అవగాహన పెంచేందుకు ఈ కళాశాలలో ఆనాటి ప్రొఫెసర్లు తీసుకున్న చర్యలు..

ఎస్.. ఆంధ్రా మెడికల్ కాలేజీలోనీ ఆ అస్థిపంజరాల వయసు 200 ఏళ్లు..! నమ్మలేకపోతున్నారా..? అయితే ఇది చదవాల్సిందే..
Skeletons in AMC Vizag
Follow us
Eswar Chennupalli

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 22, 2023 | 11:46 AM

Andhra Medical College, Vizag: సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశాఖపట్నం లోని ఆంధ్రా వైద్య కళాశాల ఎన్నో చారిత్రక విశేషాలకు కేంద్ర బిందువు లాంటిది. విద్యార్థులకు వైద్య శాస్త్రం పై అవగాహన పెంచేందుకు ఈ కళాశాలలో ఆనాటి ప్రొఫెసర్లు తీసుకున్న చర్యలు చారిత్రక ఘట్టాలుగా మిగిలి నిరంతరం స్ఫూర్తిని రగిలిస్తూ ఉన్నాయి. అలాంటి ఒక క్లాసిక్ ఉదాహరణనే ఈ స్టోరీ.

ఆంధ్రా మెడికల్ కళాశాల అనాటమీ డిపార్ట్మెంట్‌లోని ‘అలమరాలో అస్థిపంజరాల’కు చాలా పెద్ద నేపథ్యం ఉంది. అక్షరాలా వైద్య విద్యార్థుల బోధన కోసం అనాటమీ మ్యూజియం విభాగానికి చెందిన ఈ అస్థిపంజరాలు దంతాలు, చెక్క తో 200 సంవత్సరాల క్రితం తయారు చేయబడ్డవని తెలుసుకుంటే ఆశ్చర్యపడక మానరు. ఈ ఆరుదైన దంతపు అస్థిపంజరం, దీని ఎముకలు మానవ అస్థిపంజరం తరహాలో అత్యంత ఖచ్చితత్వంతో చెక్కబడ్డాయి, ఇక్కడ ఆంధ్రా మెడికల్ కాలేజీలోని అనాటమీ మ్యూజియంలో ప్రతిష్టాత్మకమైన నిధిగా ప్రస్తుతం ఇవి ఉన్నాయి.

డాక్టర్ కృష్ణారావ్ చొరవతోనే

ఈ దంతపు అస్థిపంజరం, ఎత్తు 5 అడుగుల ఆరు అంగుళాల కాగా బరువు 231 పౌండ్లు అంటే 104.78 కిలోలు. రెండు శతాబ్దాల క్రితం చెక్కిన ఈ అస్థిపంజరలాను చెక్కిన శిల్పి యొక్క చాతుర్యాన్ని, నైపుణ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. 1798 – 1832 మధ్య కాలంలోని రాజా సెర్ఫోజీకు చెందిన తంజావూరులోని ప్రసిద్ధ సరస్వతీ మహల్ నుంచి వీటిని సేకరించబడడం జరిగింది. ఈ అస్థిపంజరం 1805 -1810 మధ్యకాలంలో తయారు చేసి ఉందిచ్చాన్నది ఒక అధ్యయనం.

ఇవి కూడా చదవండి

1929 -1946 మధ్య కాలంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రారంభ రోజుల్లో అనాటమీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ ఆర్. కృష్ణారావు వీటిని కళాశాలకు తెప్పించడంలో కీలకపాత్ర పోషించారు. దంతపు అస్థిపంజరం, రోజ్‌వుడ్ అస్థిపంజరాన్ని ఈయన అప్పట్లో 75 రూపాయలకు కొనుగోలు చేశారు. చాలా ముఖ్యమైన ప్రదర్శనలలో ఈ18వ శతాబ్దపు అస్థిపంజరాలను ప్రస్తుతం ఉంచుతున్న సమయాల్లో వైద్య రంగంలోని నిపుణులే కాకుండా సాధారణ ప్రజల ప్రశంసలను కూడా ఇప్పటికీ పొందుతూ ఉంటుంది.

1970వ దశకం మధ్యలో అప్పటి ప్రిన్సిపల్, అనాటమీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సంజీవరావు తన విద్యార్థులకు వివరిస్తూ, ఏనుగు దంతాలు ఖరీదైననీ, కొన్ని ఎముకలకు మొత్తం పెద్ద పెద్ద దంతాలు అవసరం అని వివరించడం తో అప్పటినుంచి వాటి విలువ ఏ పాటిదో అర్థమైందట. వైజాగ్‌కు చెందిన డాక్టర్ అశోక్ కొల్లూరు అప్పట్లో వైద్య కళాశాల విద్యార్థిగా అనాటమీ మ్యూజియంను సందర్శకులకు చూపించే ప్రయత్నాలు చేశారట. అయితే ఎనుగు దంతాలు లాంటి వాటి పై అప్పటికే నిషేదం ఉన్నప్పటికీ ఇప్పటికీ విక్రయించబడుతున్నందున అస్థిపంజరంలోని దంతాల యొక్క అధిక విలువను చెప్పే సాహసం చేయలేదని చెబుతారు.

1970లలో లండన్‌లో జరిగిన ఒక ఎగ్జిబిషన్‌లో బ్రిటీష్ వారు దీనిని ప్రదర్శించడానికి 5 లక్షలు చెల్లించారని చెబుతారు. అప్పట్లో ఆంధ్రా మెడికల్ కళాశాల నుంచి ఈ అస్థిపంజరాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన శవపేటికలో తీసుకెళ్ళి మళ్లీ ఒక వారం లోనే తిరిగి తెచ్చేసారని… ప్రస్తుత అనాటమీ విభాగ అధిపతి డాక్టర్ ఆశాలత టీవీ9 తో షేర్ చేశారు.

పోస్ట్‌మార్టం ఆ రోజుల్లో నిషిద్ధం అట

ఆ రోజుల్లో, మానవ శరీరాలు, అస్థిపంజరాల నిర్వహణ పై అనేక నిషేధాలు ఉండేవట. డాక్టర్ కృష్ణారావు అయితే ఆ అస్థిపంజరాలు రాక కోసం కొన్ని రోజులు డిపార్ట్‌మెంట్‌లోనే ఉండిపోయారని వైద్య శాల చెబుతోంది. నేటికీ, కొంతమంది అనాటమీ ప్రొఫెసర్లు తమ కుటుంబ సభ్యులకు మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించడం గురించి చర్చించడానికి కూడా ఇష్టపడరట.

మ్యూజియం ప్రారంభ రోజుల్లో ఈ అస్థిపంజరాలను ఆంధ్రా మెడికల్ కళాశాలకు రప్పించడం వెనుక ఆనాటి ప్రముఖ అధ్యాపకులు, ప్రొఫెసర్లు, విభాగాధిపతుల కృషి, అంకితభావాన్ని నేటి తరం శ్లాఘిస్తోంది. అందుకు గుర్తుగానే ఆంధ్రా వైద్య కళాశాల లోని అనాటమీ డిపార్ట్‌మెంట్‌కు జనవరి 24, 1984న డాక్టర్ కృష్ణారావు కృషిని గౌరవిస్తూ ఆయన పేరు పెట్టడం విశేషం

ఆంధ్రా మెడికల్ కాలేజీ శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకుంటున్నందున, ఈ సంవత్సరం చివర్లో సెంటినరీ పుస్తకాన్ని విడుదల చేయాలనే దాని పూర్వ విద్యార్ధులు ప్లాన్ చేస్తున్నారు. ఈ పుస్తకం లో ప్రారంభ రోజుల్లో దిగ్గజ అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ అర్ కృష్ణారావు స్థాపించిన AMC అనాటమీ మ్యూజియం, అస్థిపంజరాల పురాణం ఆ విశేషాలను గుర్తు చేస్తుందట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..