వచ్చే వెయ్యేళ్లకు ఇదే అత్యంత వేడి నెల..! జూలై ఉష్ణోగ్రతల గురించి నాసా సైంటిస్టులు ఏమంటున్నారంటే..?

NASA Experts on July Month: సూర్యుడు ఎన్నడూ లేని విధంగా 2023 జూన్ నెలలో భగభగ మండిపోతున్నాడు. గ్యాప్ లేకుండా వడగాల్పులు వీచాయి. నాసా లెక్కల ప్రకారం జూలై నెలలో  ఉష్ణోగ్రత సగటు 62.62 డిగ్రీలుగా నమోదవుతోంది. 2016 అగస్టులో నమోదైన 62.46 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే..

వచ్చే వెయ్యేళ్లకు ఇదే అత్యంత వేడి నెల..! జూలై ఉష్ణోగ్రతల గురించి నాసా సైంటిస్టులు ఏమంటున్నారంటే..?
Representative Image of July Month, 2023
Follow us

|

Updated on: Jul 21, 2023 | 12:30 PM

NASA Experts on July Month: సూర్యుడు ఎన్నడూ లేని విధంగా 2023 జూన్ నెలలో భగభగ మండిపోతున్నాడు. గ్యాప్ లేకుండా వడగాల్పులు వీచాయి. నాసా లెక్కల ప్రకారం జూలై నెలలో  ఉష్ణోగ్రత సగటు 62.62 డిగ్రీలుగా నమోదవుతోంది. 2016 అగస్టులో నమోదైన 62.46 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఇది 0.16 డిగ్రీలు ఎక్కువే. తొలకరి జల్లులు కురవాల్సిన జూలై నెలలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై నాసా ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న 100 సంవత్సరాల్లో 2023 జూలై అత్యంత వేడి నెలగా రికార్డుల్లో నిలిచే అవకాశం ఉందన్నారు. ఇది రానున్న వేయేళ్ల ఉష్ణోగ్రతల రికార్డ్‌లో కూడా ఉండే అవకాశం ఉందని నాసా టాప్ క్లైమాటాలజిస్ట్ గావిన్ ష్మిడ్జ్ గురువారం తెలిపారు.

జూలై నెలలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పటికే యూరోపియన్ యూనియన్, మైన్ యూనివర్సిటీ లెక్కలను మించిపోయాయి. ఈ రెండింటి లెక్కలు ఒకదానికొకటి కొద్దిపాటి తేడాతో ఉన్నా ఈ నెలలో విపరీతమైన వేడి ఉంటుందని నాసా మీడియా సమావేశంలో ష్మిడ్జ్ పేర్కొన్నారు. ఇంకా ‘ఇంతకముందు చూడనంతగా వడగాల్పులు యూఎస్, యూరప్, చైనాలో.. ఇలా ప్రపంచమంతా నమోదవుతున్నాయి. వీటికి ఎన్ నినో వాతావరణమే కారణంమని చెప్పలేము. ఈ వడగాల్పుల వెనుక ఎల్ నినో పాత్ర చాలా చిన్నదైనప్పటికీ కొన్ని నెలలుగా రికార్డ్ స్థాయిలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఇలాగే కొనసాగుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి విడుదలచేస్తునే ఉంటున్నాం’ అని తెలిపారు.

జూలై నెల మాత్రమే కాదు, 2023 కూడా రికార్డుల్లో అత్యంత వేడి సంవత్సరంగా ఉండే అవకాశాలను ప్రస్తుత ఉష్ణోగ్రతలు పెంచుతున్నాయని ష్మిడ్జ్ అన్నారు. అలాగే ఇందుకు 50-50 అవకాశాలు ఉన్నప్పకీ.. ఇది జరిగేందుకు 80 శాతం అవకాశం ఉందని ఇతర శాస్త్రవేత్తలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే వచ్చే 2024 మరింత వేడి సంవత్సరంగా ఉంటుదని తమ అంచనా అని, ఇప్పటికే నమోదైన అధిక ఉష్ణోగ్రతలతో ప్రపంచ అతలాకుతలమైన నేపథ్యంలో ష్మిడ్ట్ ఈ విధమైన హెచ్చరికలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎలక్ట్రిక్‌ ప్రెష‌ర్ కుక్కర్‌లో వండినఅన్నం తింటే ఏమవుతుందో తెలుసా
ఎలక్ట్రిక్‌ ప్రెష‌ర్ కుక్కర్‌లో వండినఅన్నం తింటే ఏమవుతుందో తెలుసా
రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే..
రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే..
కడుపు మసాజ్‌తో చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?
కడుపు మసాజ్‌తో చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?
మీరు కారు కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ఈ 7 కార్లపై భారీ తగ్గింపు
మీరు కారు కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ఈ 7 కార్లపై భారీ తగ్గింపు
వావ్..రోటీతో మ్యాగీ.. ఇలా కూడా తయారు చేయవచ్చా..!
వావ్..రోటీతో మ్యాగీ.. ఇలా కూడా తయారు చేయవచ్చా..!
అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం
అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం
యాడ్‌పై క్లిక్‌ చేస్తే రూ. 1.16కోట్లు లాగేశారు.. జాగ్రత్త భయ్యా!
యాడ్‌పై క్లిక్‌ చేస్తే రూ. 1.16కోట్లు లాగేశారు.. జాగ్రత్త భయ్యా!
డైట్‌ సోడాలతో ఆరోగ్యానికి ముప్పు.. నిపుణులు చెబుతున్న షాకింగ్‌
డైట్‌ సోడాలతో ఆరోగ్యానికి ముప్పు.. నిపుణులు చెబుతున్న షాకింగ్‌
ఒక్కొక్కరికి రూ.లక్ష 90 వేలు.. చెక్కులు పంపిణీ చేసిన భట్టి
ఒక్కొక్కరికి రూ.లక్ష 90 వేలు.. చెక్కులు పంపిణీ చేసిన భట్టి
ఆ కుర్రాడి వాయిస్‏లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా..
ఆ కుర్రాడి వాయిస్‏లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా..