- Telugu News Photo Gallery Cricket photos Team India have won the Asia Cup for the most number of times, but IND and PAK never competed for the title in the tourney history
Asia Cup: 1984 నుంచి భారత్ విజేతగా నిలిచిన ఆసియా కప్ ఎడిషన్స్ ఇవే.. ఇప్పటికైనా చరిత్ర చూడని ఆ ఫైనల్ మ్యాచ్ సాధ్యమేనా..?
Cricket Asia Cup: 1984 నుంచి జరుగుతున్న ఆసియా కప్ టోర్నీ తొలి సీజన్‌లో భారత జట్టే విజేతగా నిలిచింది. ఇప్పటివరకు టీమిండియా గెలిచిన టోర్నీ ఎడిషన్స్, ఆయా టోర్నీల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 20, 2023 | 3:34 PM

Asia Cup: ఆసియా ఖండంలోని క్రికెట్ దేశాల మధ్య జరిగే ఆసియా కప్ టోర్నమెంట్ 1984 నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకు 15 ఆసియా కప్ టోర్నీలు పూర్తవగా.. అందులో 7 సార్లు భారత జట్టే గెలిచింది. తద్వారా అత్యధిక సార్లు టోర్నీ గెలిచిన రికార్డ్ కూడా టీమిండియా పేరిట ఉంది. ఈ ట్రోఫీని శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు గెలుచుకున్నాయి.

1984- యుఏఈ వేదికగా జరిగిన తొలి సీజన్ ఆసియా కప్ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఆరంగేట్ర సీజన్‌లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది.

1988- బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మూడో ఎడిషన్‌లో భారత్ మళ్లీ లంక జట్టునే ఓడించి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.

1990/91- స్వదేశంలోనే జరిగిన నాల్గో ఎడిషన్ ఆసియా కప్ ఫైనల్‌లో లంక జట్టును భారత్ వరుసగా రెండోసారి ఓడించి, విజేతగా నిలవగలిగింది.

1995- ఆసియా కప్ ఫైనల్‌లో లంక జట్టును వరుసగా మూడో సారి ఓడించి భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది.

2010- 15 ఏళ్ల పాటు ఆసియా కప్ కరువును ఎదుర్కొన్న భారత్.. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో ఐదోసారి టోర్నీని గెలుచుకుంది.

2016, 2018 ఎడిషన్ ఆసియా కప్ టోర్నీల్లో బంగ్లాదేశ్ జట్టుపైనే టీమిండియా గెలిచి, టైటిల్స్‌ని గెలుచుకుంది.

అయితే క్రికెట్ ఫ్యాన్స్‌ని నిరాశపరిచే విషయం ఏమిటంటే.. ఆసియా కప్ చరిత్రలో ఒక్కసారి కూడా భారత్, పాకిస్థాన్ టైటిల్ మ్యాచ్‌లో తలపడలేదు. మరి ఈ నేపథ్యంలో త్వరలో పాక్-లంక సంయుక్తంగా నిర్వహిస్తున్న 16వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీలో అయితే క్రికెట్ ఫ్యాన్స్ కోరుకునే భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ సంభవిస్తుందో లేదో చూడాలి..





























