ఏపీలో కరోనా విలయతాండవం…నెల్లూరులో అత్యధికంగా పాజిటివ్ కేసులు
భారత్‌లోనూ కరోనా కోరలు చేస్తోంది. కోవిడ్-19 బారిన పడి తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ మృత్యుఘంటికలు మోగిస్తోంది. తాజాగా...

ఏపీలో కరోనా విలయతాండవం…నెల్లూరులో అత్యధికంగా పాజిటివ్ కేసులు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి మరింత తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. భారత్‌లోనూ కరోనా కోరలు చేస్తోంది. కోవిడ్-19 బారిన పడి తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ మృత్యుఘంటికలు మోగిస్తోంది. తాజాగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో ఏపీ తెలంగాణను దాటేసింది. ఏపీలో మొత్తం కేసులు 161కి చేరుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం..
రాష్ట్రంలో గురువారం (02-04-2020) రాత్రి 10 గంటల తర్వాత నుంచి శుక్రవారం (03.04.2020) ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు మరో 12 నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 161కి చేరాయి. జిల్లాలవారీగా కొత్త కేసుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 8 ఉన్నాయి.
మొత్తం కేసులు – 161
జిల్లాలవారీగా కేసుల వివరాలుః
నెల్లూరు జిల్లా – 32
గుంటూరు జిల్లా – 20
ప్రకాశం జిల్లా – 17
కడప జిల్లా – 19
కృష్ణా జిల్లా – 23
పశ్చిమ గోదావరి జిల్లా – 15
విశాఖపట్నం జిల్లా -14
తూర్పుగోదావరి జిల్లా – 9
చిత్తూరు జిల్లా – 9
అనంతపురం జిల్లా -2
కర్నూలు జిల్లా – 1