AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel Plant: ప్రజల తరపున బిడ్‌లో పాల్గొంటున్నా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లో సైతం కలకలం రేపుతోంది. ప్రైవేటీకరణ అంశంతో మొదలైన రాజకీయాలు.. బిడ్ల వరకు చేరుకుంది. కేంద్రం ప్రైవేటికరణ విషయంలో వెనక్కి తగ్గకపోవడం.. తెలంగాణ ప్రభుత్వం సైతం బిడ్ వేసేందుకు ఆసక్తి చూపడం.. లాంటి ఘటనలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Vizag Steel Plant: ప్రజల తరపున బిడ్‌లో పాల్గొంటున్నా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..
Lakshminarayana
Shaik Madar Saheb
|

Updated on: Apr 15, 2023 | 12:37 PM

Share

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లో సైతం కలకలం రేపుతోంది. ప్రైవేటీకరణ అంశంతో మొదలైన రాజకీయాలు.. బిడ్ల వరకు చేరుకుంది. కేంద్రం ప్రైవేటికరణ విషయంలో వెనక్కి తగ్గకపోవడం.. తెలంగాణ ప్రభుత్వం సైతం బిడ్ వేసేందుకు ఆసక్తి చూపడం.. లాంటి ఘటనలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బిడ్‌లో పాల్గొనేందుకు కొత్త శక్తులు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. స్టీల్‌ ప్లాంట్‌ EOIలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. జనం తరపున బిడ్‌లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు EOIలో లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. ప్రస్తుతానికి వివరాలు సస్పెన్స్‌ అని ప్రకటించిన లక్ష్మీనారాయణ.. ప్రజల తరపున బిడ్‌లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బిడ్డింగ్‌లో తాను పాల్గొంటున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. దానికి సంబంధించిన పత్రాలన్నింటితో సిద్ధమవుతున్నానని, ఈ మధ్యాహ్నం EOIలో పాల్గొనబోతున్నానని తెలిపారు. తమ ప్రతిపాదను రిజెక్ట్ చేస్తే కోర్టుకు వెళ్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ పబ్లిక్‌ సెక్టార్‌లో ఉండాలదన్నది తమ లక్ష్యమని ప్రకటించారు.

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు భారీ పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ నుంచి సింహాచలం వరకు ఈ పాదయాత్ర సాదింది. ఉదయమే మొదలైన ఈ పాదయాత్రలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉక్కు సంకల్పయాత్ర పేరుతో ఈ పాదయాత్ర చేపట్టారు. రెండున్నర సంవత్సరాలు చేస్తున్న ఈ పోరాటాన్ని అవసరమైతే మరో రెండున్నర సంవత్సరాలు కొనసాగించేందుకు తామంత సిద్ధమని కార్మికులు ప్రకటించారు. గతంలోనూ కేంద్రం పాస్కోను స్టీల్‌ ప్లాంట్ అమ్మే ప్రయత్నం చేసిందని దాన్ని తాము దీటుగా తిప్పికొట్టగలిగామని కార్మికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..