AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబర్ లోకల్‌బాయ్ నానీపై కేసు.. ఏకంగా క్రిమినల్ చర్యలకు సిద్ధమైన పోలీస్!

అమాయకులు, డబ్బు మీద అత్యాశ ఉన్నవాళ్లు వాటికి ఎట్రాక్ట్‌ అయితే.. అంతే సంగతులు. ఇప్పటికే చాలామంది యువతులు బెట్టింగ్ యాప్‌లలో నష్టపోయి సూసైడ్స్‌ చేసుకున్న ఘటనలు చూశాం. అయినా నానీ లాంటి స్వార్థపరులు వాళ్లకొచ్చే ప్రమోషన్ డబ్బు కోసం ఇలా వీడియోస్ చేయడం సహజమైపోయింది.

యూట్యూబర్ లోకల్‌బాయ్ నానీపై కేసు.. ఏకంగా క్రిమినల్ చర్యలకు సిద్ధమైన పోలీస్!
Local Boy Nani
Balaraju Goud
|

Updated on: Feb 22, 2025 | 11:31 PM

Share

సాధారణంగా ఫాలోవర్స్ ఎక్కువైతే వాళ్లు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారతారు. వాళ్లకున్న ఫాలోవర్స్‌ని బట్టి ఆయా సంస్థలు వాళ్లను ప్రమోషన్‌కి వాడుకుంటాయి. ఆ చేసేదేదో మంచి ప్రమోషన్స్‌ అయితే ఇబ్బంది లేదు. కానీ లోకల్‌బాయ్‌ నానీ మాత్రం తన యూట్యూబ్ చానల్‌ ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తుంటాడు. దేశంలో ఇది చట్టరీత్యా నేరం. ఆ ప్రమోషన్ కూడా ఓ డ్రామాలా క్రియేట్ చేస్తారు.

అమాయకులు, డబ్బు మీద అత్యాశ ఉన్నవాళ్లు వాటికి ఎట్రాక్ట్‌ అయితే.. అంతే సంగతులు. ఇప్పటికే చాలామంది యువతులు బెట్టింగ్ యాప్‌లలో నష్టపోయి సూసైడ్స్‌ చేసుకున్న ఘటనలు చూశాం. అయినా నానీ లాంటి స్వార్థపరులు వాళ్లకొచ్చే ప్రమోషన్ డబ్బు కోసం ఇలా వీడియోస్ చేయడం సహజమైపోయింది. నానీ ప్రమోషన్స్‌ని గతంలోనే తెలంగాణ కేడర్ IPS అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశ్నించారు. సమాజానికి చీడలా తయారయ్యారని, ఎవరూ ఇలాంటి వాళ్ల ప్రమోషన్స్‌ చూసి బలి కావద్దని సూచించారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖలో యూట్యూబర్ లోకల్‌బాయ్ నానీపై కేసు నమోదైంది. బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్‌ చేస్తుండడంతో క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు.అతని ప్రమోషన్స్‌పై AIYF యూత్‌ వింగ్‌ విశాఖ పోలీస్ కమిషనర్ శంకబత్ర బాగ్చీకి ఫిర్యాదు చేసింది. ఆయన వాటిపై ఆరా తీసి.. చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. అతనిపై క్రిమినల్‌ చర్యలకు సిద్దమయ్యారు. నానీ వీడియోస్‌, ప్రమోషన్స్‌ను వీక్షించిన సీపీ శంకబత్ర బాగ్చీ, నానీ ప్రమోట్‌ చేస్తున్న బెట్టింగ్ యాప్‌లో పాల్గొంటే ఇల్లు గుల్లే! అని గుర్తించారు. స్వార్థం కోసం అమాయకులను బలిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, నానీ తరహా ఆలోచనల్లో ఉన్నవాళ్లకు జాగ్రత్త అంటూ సీపీ శంకబత్ర బాగ్చీ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…