Vizag Metro: 4 కారిడార్లు, 42 స్టేషన్లు.. విశాఖ మెట్రోకు వడివడిగా అడుగులు.. ఇది మాత్రమే కాదు.. ట్రామ్‌ కూడా..

Visakhapatnam Metro Rail: ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఇటీవల విశాఖకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు అంశం పైనే కీలక చర్చ జరిగింది. ఇప్పటికే మెట్రో కు డీ పి అర్ పూర్తయినా మెట్రో వయబుల్ కాని రూట్లలో ఆధునాతన ట్రామ్ కు కూడా డీ పి అర్ లు సిద్దం చేయాలని, నిధులు సమీకరణకు అవకాశాలను..

Vizag Metro: 4 కారిడార్లు, 42 స్టేషన్లు.. విశాఖ మెట్రోకు వడివడిగా అడుగులు.. ఇది మాత్రమే కాదు.. ట్రామ్‌ కూడా..
Vizag Metro Project
Follow us
Eswar Chennupalli

| Edited By: Sanjay Kasula

Updated on: Oct 06, 2023 | 6:37 PM

విశాఖ లో మెట్రో కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఇటీవల విశాఖకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు అంశం పైనే కీలక చర్చ జరిగింది. ఇప్పటికే మెట్రో కు డీ పి అర్ పూర్తయినా మెట్రో వయబుల్ కాని రూట్లలో ఆధునాతన ట్రామ్ కు కూడా డీ పి అర్ లు సిద్దం చేయాలని, నిధులు సమీకరణకు అవకాశాలను అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కు సూచించారు.

రాష్ట్ర ప్రతిపాదిత పాలనా రాజధాని గా విశాఖ ను ప్రకటించింది స్వయంగా ముఖ్యమంత్రి తన నివాసాన్ని షిఫ్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చే లక్ష్యంతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణంపై దృష్టి పెట్టింది. 2021 అంచనాల ప్రకారం విశాఖపట్నంలో జనాభా 25 లక్షలకు మించి ఉంది. మెట్రో రైలును ప్లాన్ చేసిన శివారు ప్రాంతాలను కలుపుకుంటే ఆ మొత్తం జనాభా 41 లక్షలు దాటుతుంది. ఈ నేపథ్యంలో వయబిలిటి పై సర్వే పూర్తి చేసి డి పీ అర్ ల పై దృష్టి సారించింది ప్రభుత్వం.

జనవరి 15 న శంకుస్థాపన..

రేపటి దసరా తర్వాత విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో నగర ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ప్రాధాన్యత అంశంగా మారింది. మెట్రో రైలును ప్రవేశపెట్టడం వల్ల ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు ప్రయాణికుల విలువైన సమయం ఆదా అవుతుందన్న లక్ష్యంతో మెట్రో రైలు ప్రతిపాదనలు రూపు దిద్దుకుంటున్నాయి. 2024 జనవరి 15న మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది.

4 కారిడార్లు, 42 స్టేషన్ లు

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభ దశలో 42 మెట్రో స్టేషన్లను కలిగి ఉన్న నాలుగు కారిడార్ల నిర్మాణాన్ని కలిగి ఉండే విధంగా ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి.

  1. కారిడార్-1: 34.40 కిలో మీటర్ల మేర విస్తరించి, స్టీల్ ప్లాంట్ గేట్ నుండి కొమ్మాది జంక్షన్ వరకు విస్తరించి ఉందనుంది.
  2. కారిడార్-2: 5.07 కిలో మీటర్లు కవర్ చేస్తూ గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు ను కలుపనుంది.
  3. కారిడార్-3: 6.75 కిలో మీటర్ల మేర చుట్టుముట్టి, తాటిచెట్లపాలెం నుండి చిన్న వాల్తేరు వరకు నడవనుంది.

కారిడార్-4

  • కొమ్మాదికి నుండి భోగాపురం విమానాశ్రయం వరకు ఈ నాలుగు కారిడార్లు సమిష్టిగా 42 స్టేషన్లు, రెండు డిపోల తో సమగ్ర మెట్రోను సృష్టించే విధంగా డీ పీ అర్ తయారైంది..

మెట్రో మాత్రమే కాదు, ట్రామ్‌ కూడా..

అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో మెట్రోను అనుసంధానం చేయడం వీలు కాదు కాబట్టి ప్రధాన జంక్షన్లను అనుసంధానించే లక్ష్యంతో బీచ్ రోడ్డు వెంబడి అధునాతన ట్రామ్ కారిడార్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ ట్రామ్ వ్యవస్థ మొత్తం 60.05 కిలో మీటర్ల దూరాన్ని కలిగి ఉండనుంది. ఈ ఆధునిక ట్రామ్ నెట్‌వర్క్ కోసం నాలుగు కారిడార్‌లను రూపొందించనున్నారు. ఒక కారిడార్ కోస్టల్ బ్యాటరీ నుండి భీమిలి వరకు విస్తరించి ఉంటుంది, మరొకటి ఉక్కు కర్మాగారాన్ని అనకాపల్లికు అనుసంధానం చేస్తుంది. ఎన్ ఎ డీ జంక్షన్ నుండి పెందుర్తి వరకు ఒక ట్రామ్ కారిడార్ ను ప్రతిపాదించబడింది.

ఇవన్నీ డీ పీ అర్ స్టేజ్ లు దాటి ప్రభుత్వాల ఆమోదం పొంది నిర్మాణ దశకు వెళ్ళాలని ప్రజలు కోరుతున్న పరిస్తితి కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం