Watch Video: నారా లోకేష్‌ను చూడగానే తల్లి భువనేశ్వరి, బ్రాహ్మణి ఎమోషనల్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో నారా లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. అంతకు ముందు విజయవాడ నుంచి భారీ ర్యాలీతో లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత అక్కడ భువనేశ్వరి, బ్రాహ్మణిలను లోకేష్ కలుసుకున్నారు.
నారా లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అంతకు ముందు విజయవాడ నుంచి భారీ ర్యాలీతో లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత అక్కడ భువనేశ్వరి, బ్రాహ్మణిలను లోకేష్ కలుసుకున్నారు. నారా లోకేష్‌ను కలుసుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి భావోద్వేగానికి గురైయ్యారు. కాసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.
చంద్రబాబుతో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ అంశంపై తాను ఏమీ మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. అలాగే ఢిల్లీలో తాను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసేందుకు వారి అపాయింట్‌మెంట్లు కోరలేదని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఉన్నట్లు చెప్పారు. అయితే జైల్లో ఆయన భద్రత పట్ల తాము ఆందోళనగా ఉందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొందరు నక్సల్స్, గంజాయి కేసుల్లో అరెస్టైన ఖైదీలు ఉన్నారని గుర్తుచేశారు.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

