AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులు బీ అలర్ట్‌..! మీ వెహికిల్‌పై పెండింగ్ చ‌లాన్లు ఉన్నాయా..?

రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడిపే వారిని ఇక ఉపేక్షించకూడదని పోలీసులు ప్రత్యేక కార్యక్రమం సిద్ధం చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, కొందరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వాళ్లు చేసిన తప్పుకు అమాయక వాహనదారులు మరొకరు ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది.

వాహనదారులు బీ అలర్ట్‌..! మీ వెహికిల్‌పై పెండింగ్ చ‌లాన్లు ఉన్నాయా..?
E Challans Target
Jyothi Gadda
|

Updated on: Apr 25, 2023 | 6:46 PM

Share

విశాఖ మహానగరం శర వేగంగా అభివృద్ధి చెందుతుంది. జనాభా కూడా క్రమంగా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కుర్ర కారు స్పీడ్ కు హద్దు లేకుండా పోతుంది. మరికొంతమంది కనీస నిబంధనలు తుంగలోకి తొక్కి వాహనాలతో రోడ్ల పైకి వస్తున్నారు. సహచర వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మళ్ళీ షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారు సదరు వాహనదారులు. ఎందుకంటే జరిమానాలు వేసిన తర్వాత చాలామంది వాటిని చెల్లించడం లేదు. మళ్లీ ఎదతదంగా రోడ్లపైకి వచ్చి నిబంధన అతిక్రమిస్తూనే ఉన్నారు. దీంతో ఒక్కో వాహనంపై భారీగా పెండింగ్ చలాన్లు పేరుకుపోతున్నాయి. దీంతో ఇక నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిపి త్రివిక్రమ్ వర్మ… పెండింగ్ చలాన్లపై ఫొకస్ పెట్టారు. పేరుకుపోయిన చలనాలు వసూలు చేయడంతో పాటు… పదేపదే నిబంధన అతిక్రమిస్తున్న వారిపై చర్యలకు స్పెషల్ టీం ను రంగంలోకి దింపారు.

ఈ చలానాల విధానం ప్రారంభమైన నాటి నుంచి లక్షల చలానాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ వీటిలో 10% మంది కూడా చెల్లించడం లేదు. గడచిన కొన్ని విలువ ఈ పెండింగ్ ఛానల్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2021 లో సుమారు 15 లక్షల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. వీటి ద్వారా దాదాపుగా 50 కోట్ల వరకు జరిమనాల రూపంలో పోలీస్ శాఖ వసూలు చేయాల్సి ఉంది. గతేడాది కూడా తొమ్మిది లక్షల చలానాలతో… 22 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ చలానాలపై పోలీసుల దృష్టి పెట్టకపోవడంతో కొంతమంది వాహన చొదవకులు మరింత రెచ్చిపోతున్నారు. ఈ చలానాలు పడిన చెల్లించాల్సిన పని లేదన్న ధీమాతో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. అటువంటి వారిపై ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇటీవలే విశాఖ సిటీలో 100 పైగా ట్రాఫిక్ చలాన్లతో టాప్ 20 లో ఉన్న వాహనదారుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. కొంతమంది నుంచి వసూలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలామంది తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. ఈసారి పట్టుబడితే.. జరిమానా చెల్లించిన తర్వాతనే వాహనం విడిచిపెట్టేలా ప్రణాళికను సిద్ధం చేశారు.

రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడిపే వారిని ఇక ఉపేక్షించకూడదని పోలీసులు ప్రత్యేక కార్యక్రమం సిద్ధం చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, కొందరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వాళ్లు చేసిన తప్పుకు అమాయక వాహనదారులు మరొకరు ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది. ఇక వాహన చొదకుల భద్రతే తొలి ప్రాధాన్యంగా రోడ్డు ప్రమాద రహిత విశాఖను తీర్చిదిద్దేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు పోలీసులు. చలాన్ నే కదా వేసుకుంటే వేసుకొని లే అనుకుంటే ఇకనుంచి మీ ఆట కట్టైనట్టే.. బి అలర్ట్… బి కేర్ఫుల్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..