Watch Video: 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి.. షాకింగ్‌ వీడియో వైరల్.. చూస్తే భయానకం

బాలుడు కాంపౌండ్ నుండి బయటకు వచ్చి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే ఒక వీధి కుక్క అకస్మాత్తుగా ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి అతని దాడి చేసింది. సైకిల్‌పై ఉన్న బాలుడిని కిందపడేసి తీవ్రంగా కరిచి గాయపరిచింది.

Watch Video: 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి.. షాకింగ్‌ వీడియో వైరల్.. చూస్తే భయానకం
Cctv Shows Stray Dog Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 25, 2023 | 6:15 PM

రోజు రోజుకు వీధి కుక్క‌లు రెచ్చిపోతున్నాయి. గడప దాటి రోడ్డుపైకి రావాలంటే ఎక్కడ పిక్కలు పట్టుకొని పీకుతాయో..దాడి చేసి చంపుతాయో అనే భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోజు రోజుకు వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా భయాన్నికలిగిస్తున్నాయి.. పిల్లలపై వీధికుక్క దాడి ఘటన కొత్త కాదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు తప్పడం లేదు. తాజాగా కేరళ నుంచి అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సైకిల్‌పై వెళ్తున్న బాలుడిపై వీధికుక్క దాడి చేస్తున్న భయానక దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

కేరళలో 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన భయానక వీడియో ఇది. బాలుడు కాంపౌండ్ నుండి బయటకు వచ్చి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే ఒక వీధి కుక్క అకస్మాత్తుగా ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి అతని దాడి చేసింది. సైకిల్‌పై ఉన్న బాలుడిని కిందపడేసి తీవ్రంగా కరిచి గాయపరిచింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఫుటేజీ ఆధారంగా.. కొంతమంది పిల్లలు ఇంటి గేటు బయట నిలబడి ఉన్నారు. అక్కడే ఒక బాలుడు సైకిల్‌పై వస్తుండగా ఎక్కడ్నుంచో వచ్చిన వీధి కుక్క అతనిపై దాడి చేసింది. కుక్కదాడితో భయపడిపోయిన మిగతా పిల్లలు భయంతో ఇంట్లోకి పరుగులు తీయగా బాలుడు ఒంటరిగా పోరాడాడు. ఎలాగోలా కుక్క బారినుంచి తప్పించుకుని ఇంటి గేటు లోపలికి పరిగెత్తాడు. కానీ, అప్పటికే ఆ కుక్క బాలుడిని తీవ్రంగా కరిచింది. వీధికుక్క దాడికి గురైన బాలుడు ఏడో తరగతి చదువుతున్నట్టుగా తెలిసింది. కాగా, ఈ సంఘటన ఆదివారం 12 సెప్టెంబర్ 2022 న జరిగింది. కానీ, మరోమారు సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?