Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమ్మాయిలూ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో మీ ఫోటోలు పెడుతున్నారా.? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే

సైబర్‌ క్రైమ్‌ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. చాలామంది ఆర్థికంగా చితికిపోతే.. మరికొందరు వ్యక్తిగత జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల ఎమోషన్స్ తో నేరగాళ్లు ఆటలాడుకుంటున్నారు. స్నేహం చేసి వాళ్ల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. దీంతో కక్కలేక మింగలేక లోలోన మదన పడిపోతూ ఆత్మహత్యాయత్నాలకు వెళ్లే పరిస్థితిలు కూడా దారితీస్తున్నాయి...

Andhra Pradesh: అమ్మాయిలూ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో మీ ఫోటోలు పెడుతున్నారా.? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే
Representative Image
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Narender Vaitla

Updated on: Oct 26, 2023 | 12:48 PM

సోషల్ మీడియా ద్వారా ఎంత లాభాలు ఉన్నాయో.. అప్రమత్తత లేకుంటే అన్నే అనర్ధాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు భౌతికంగా బెదిరించి, దాడులు చేసి దోచుకునే వారు ఇప్పుడు ఆన్‌లైన్‌లో బెదిరింపులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

సైబర్‌ క్రైమ్‌ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. చాలామంది ఆర్థికంగా చితికిపోతే.. మరికొందరు వ్యక్తిగత జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల ఎమోషన్స్ తో నేరగాళ్లు ఆటలాడుకుంటున్నారు. స్నేహం చేసి వాళ్ల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. దీంతో కక్కలేక మింగలేక లోలోన మదన పడిపోతూ ఆత్మహత్యాయత్నాలకు వెళ్లే పరిస్థితిలు కూడా దారితీస్తున్నాయి. తాజాగా విశాఖలో ఓ యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు కోసం వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. విశాఖకు కు చెందిన ఓ యువతి కి అజ్ఞాత వాట్స్అప్ ఎకౌంటు ద్వారా మెసేజ్ వచ్చింది. అది ఫేక్ ఎకౌంటు. తనకు వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్‌ వాట్సాప్ లో పంపించాడు అజ్ఞాతకుడు. సాధారణ ఫోటోలను బూతు ఫోటోలుగా మార్చి పంపించాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. నగదు పంపాలని బెదిరింపులకు దిగాడు. లేకుంటే.. ఫోటోలను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో ఒక్కసారిగా షాకైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సాంకేతిక సహాయంతో నిందితుడిని ట్రాక్ చేశారు. బర్మా క్యాంప్ కు చెందిన 19 ఏళ్ల బొడ్డేటి ఢిల్లీష్ గా గుర్తించి అరెస్టు చేశారు.

జాగ్రత్తగా ఉండాల్సిందే..

సోషల్ మీడియా.. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ లో రిక్వెస్ట్ వచ్చినా అజ్ఞాత వ్యక్తులను యాక్సెప్ట్ చేయవద్దని అంటున్నారు పోలీసులు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలియని లినక్స్ క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ K భవాని ప్రసాద్ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.