Andhra Pradesh: భారమైన కన్నతల్లి.. డంపింగ్ యార్డ్‌లో అమ్మను అనాథగా వదిలి వెళ్లిన కొడుకు..
మానవత్వం మంట కలిసింది.. నవ మాసాలు కని పెంచిన కన్నతల్లే భారమైంది. కనికరం లేని కన్న కొడుకు ఏకంగా తల్లిని డంపింగ్ యార్డ్‌లో వదిలి వెళ్లాడు.
మానవత్వం మంట కలిసింది.. నవ మాసాలు కని పెంచిన కన్నతల్లే భారమైంది. కనికరం లేని కన్న కొడుకు ఏకంగా తల్లిని డంపింగ్ యార్డ్‌లో వదిలి వెళ్లాడు. కన్న ప్రేగే బరువుగా మారటాన్ని జీర్ణించుకోలేని తల్లి చనిపోవాలనుకుంది. అయితే చివరి క్షణంలో కొడుకు గుర్తొచ్చి బలవన్మరణ ప్రయత్నాన్ని విరమించుకుంది. డంపింగ్ యార్డులో ఉన్న ఆ వృద్దురాలని గమనించిన స్థానికులు రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వీఆర్వో స్పందించి ఆ వృద్దురాలిని ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించారు. రెండు రోజుల నుండి తాడేపల్లి బ్రహ్మానందపురంలోని డంపింగ్ యార్డులో రెండు రోజుల నుండి ఒక వృద్దురాలు కూర్చుని ఉంది. ఈ విషయాన్ని స్థానికులు రెవిన్యూ అధికారులకు చెప్పడంతో వీఆర్వో గోలి ఇన్నయ్య డంపింగ్ యార్డు వద్దకు వచ్చి ఆ మహిళ వివరాలు సేకరించారు. తన పేరు రామలక్ష్మీ అని తన భర్త పేరు కృష్ణ అని చెప్పిన వృద్దురాలు తనది విజయవాడలోని గవర్నర్ పేట అని చెప్పింది. రెండు రోజుల క్రితం ఆటోలో తనను ఇక్కడకు తీసుకొచ్చి వదిలి వెళ్లిపోయినట్లు తెలిపింది. కొడుకు శ్రీనివాసే తనని వదిలిపెట్టి వెళ్లినట్లు చెబుతుంది.
దీంతో ఆమెను రెవిన్యూ అధికారులు ఓల్డేజ్ హోమ్ కు తరలించారు. ఆమె పూర్తి వివరాలు సేకరించి ఇంటి అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కన్న తల్లిని వదిలించుకునేందుకు కొడుకే ఆమెను డంపింగ్ యార్డులో వదిలిపెట్టినట్లు రెవిన్యూ సిబ్బంది భావిస్తున్నారు. వ్రద్దురాలు మానసిక స్థితి సరిగానే ఉన్నా కొడుకే డంపింగ్ యార్డులో వదిలి పెట్టి వెళ్లడంతో ఆవేదనకు గురై పూర్తి వివరాలు చెప్పటానికి నిరాకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఓల్డేజ్ హోంలో కొలుకుంటుంది. సరిగా ఆహారం లేకపోవడంతో మరింత నిరసంగా ఉన్నట్లు సిబ్బంది చెప్పారు.
కన్నతల్లే భారంగా మారిన ఘటన తాడేపల్లి పరిసరాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కన్నవారు బరువు కాదు బాధ్యత అంటూ పలువురు అనటం మరింత ఆవేదన పెంచింది. ప్రస్తుతం రెవిన్యూ సిబ్బంది ఆమెను సొంత వారి దగ్గరకు చేర్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
టి నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..