YS Jagan: విజయవాడ సీపీ కీలక నిర్ణయం.. సీఎం జగన్‌పై దాడి ఘటనపై సిట్ ఏర్పాటు..

సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్‌పై జరిగింది రాళ్ల దాడి కాదు.. ఎయిర్‌ గన్‌తో కాల్చారని అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ. జగన్‌ కణతకు గురిపెట్టి షార్ప్ షూటర్‌తో టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. అది మరో చోట తగిలి ఉంటే ప్రమాదం ఊహాకే అంది ఉండేది కాదంటోంది.

YS Jagan: విజయవాడ సీపీ కీలక నిర్ణయం.. సీఎం జగన్‌పై దాడి ఘటనపై సిట్ ఏర్పాటు..
Ys Jagan
Follow us

|

Updated on: Apr 14, 2024 | 6:50 PM

సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్‌పై జరిగింది రాళ్ల దాడి కాదు.. ఎయిర్‌ గన్‌తో కాల్చారని అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ. జగన్‌ కణతకు గురిపెట్టి షార్ప్ షూటర్‌తో టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. అది మరో చోట తగిలి ఉంటే ప్రమాదం ఊహాకే అంది ఉండేది కాదంటోంది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని కోరుతూ ఇప్పటికే.. వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కాగా.. సీఎం జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా.. సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. దానిలో భాగంగా.. గంగానమ్మ గుడి ప్రాంతంలో కాల్‌డేటా డంప్‌ను ఫిల్టర్‌ చేస్తున్నారు పోలీసులు. దాడి జరిగిన ప్రాంతంలోని గత 15 రోజుల అనుమానాస్పద కదలికలపై ఫోకస్‌ పెట్టారు. అటు.. ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

ఇప్పటికే.. వెల్లంపల్లి ఫిర్యాదుతో ఐపీసీ 307 సెక్షన్‌ కింద హత్యాయత్నంతోపాటు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు విజయవాడ పోలీసులు. దాడి ఘటనపై దర్యాప్తునకు 20 మందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు..కాగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై సిట్ ఏర్పాటు చేస్తూ.. సీపీ క్రాంతి రాణా టాటా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

వీడియో చూడండి..

ఇప్పటికే సీసీ ఫుటేజ్‌ స్వాధీనం చేసుకున్నారు. స్కూల్‌, టెంపుల్‌ మధ్య ఓపెన్‌ ప్లేస్‌ నుంచి సీఎం జగన్‌పై దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాడి సమయంలో భారీ శబ్ధం వచ్చిందని స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ఘటనా స్థలంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఎయిర్‌గన్‌తో దాడి జరిగిందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటు.. సింగ్‌నగర్ వివేకానంద స్కూల్ పరిసరాలను డ్రోన్‌తో వీడియో రికార్డ్ చేశారు. ఎక్కడి నుంచి దాడి జరిగింది, నిందితులు ఎటు పోయారనే దానిపై ప్రత్యేక బృందాలతో స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు విజయవాడ పోలీసులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి