Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఉపాధి హామి కూలీలు పని చేస్తుండగా పొదల్లో నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా

విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో పెణసాం గ్రామ శివారులోని నేరేడు చెరువులో ఓ 12 అడుగుల భారీ కొండచిలువను ఉపాధి హామి కూలీలు హతమార్చారు. పొదల్లో అది కనిపించడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీయగా, కొంతసేపటి తర్వాత యువకులు ధైర్యంగా చుట్టుముట్టి కొండచిలువను హతమార్చారు.

Andhra: ఉపాధి హామి కూలీలు పని చేస్తుండగా పొదల్లో నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా
Python
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 13, 2025 | 8:47 AM

Share

విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పెణసాంలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని నేరేడు చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీలు పనిచేస్తుండగా ఓ ఒక భారీ కొండచిలువ పొదల మధ్య నుంచి అకస్మాత్తుగా కూలీల పైకి దూసుకువచ్చింది. సుమారు 12 అడుగుల పొడవుతో, బలంగా, భయానకంగా ఉన్న కొండచిలువను చూసి అక్కడున్నవారు పెద్దపెద్ద కేకలు వేస్తూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

కొంతసేపటి తరువాత కొంత మంది యువకులు ధైర్యం తెచ్చుకొని కర్రల సహాయంతో కొండచిలువను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు. గమనించిన కొండచిలువ వారి పై ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అలా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి తలపించింది. ఎట్టకేలకు కొంతసేపటి తరువాత గ్రామస్థులంతా కలిసి కలిసికట్టుగా కొండచిలువను హతమార్చారు.. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఎట్టకేలకు కొండచిలువ హతమవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అలాంటి భారీ కొండచిలువను గ్రామస్తులు గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. అడవికి సమీపంగా ఉన్న ప్రాంతం కావడంతో అప్పుడప్పుడు చిన్నపాటి పాములు కనిపించడం సహజమే కానీ, ఈ స్థాయిలోని పాము రావడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తమకు కనిపించిన కొండచిలువ గ్రామంలో సంచరిస్తే చిన్న పిల్లలకు, పశువులకు ప్రమాదం కలగవచ్చని భావించి హతమార్చినట్లు చెప్తున్నారు.

అయితే ఈ ఘటన పై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులకు పాముల ప్రవర్తన, వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరోవైపు కొండచిలువలు సాధారణంగా మనుషులపై దాడికి దిగవని, ఆకలితో తిండిని వెతుకుతూ వస్తాయని అంటున్నారు స్నేక్ క్యాచర్స్. ఎవరికైనా పాములు కనిపిస్తే వాటిని చంపవద్దని తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అంటున్నారు స్నేక్ క్యాచర్స్. పర్యావరణ సమతుల్యత కోసం పాములు ఉండాలని, వాటిని మనం ప్రేమించాలని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
చిరు, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
చిరు, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.
ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?