AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా నుంచి కీలక పొలిటికల్ డెవలప్‌మెంట్.. వంశీ ఈజ్ బ్యాక్..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆయన పొలిటికల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో జగన్ మోహన్ రెడ్డితో కలిసి పంట నష్టాలను పరిశీలించడమే కాదు, వైఎస్సార్‌సీపీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం ప్రారంభించారు. ..

Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా నుంచి కీలక పొలిటికల్ డెవలప్‌మెంట్..  వంశీ ఈజ్ బ్యాక్..
Vallabhaneni Vamsi
S Haseena
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 04, 2025 | 6:56 PM

Share

వల్లభనేని వంశీ.. ఆంధ్రా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 2019లో టీడీపీ తరుఫున గెలిచిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో వైసీపీ సానుభూతిపరుడిగా మారాడు. అంతేనా.. టీడీపీ అగ్ర నేతలపై తన మార్క్ కామెంట్స్‌తో కాకరేపారు. కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో.. వంశీపై దాదాపు 17 కేసులు నమోదు కావడంతో, ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక దశలో అసలు వంశీ బయటకు వస్తారా అని అనుకునే పరిస్థితి ఏర్పడింది. జైలులో కొన్ని నెలలు గడిపిన అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన వంశీ, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితాన్ని గడిపారు. బాగా సన్నబడి.. జుట్టుకు కలర్ వేయకుండా పూర్తిగా మారిపోయిన వంశీ.. ఆ తర్వాత కూడా అదే లుక్ కంటిన్యూ చేశారు. ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా, ఇంటికే పరిమితమై కోర్టు కేసులపైనే దృష్టిని కేంద్రీకరించారు. ఒక దశలో ఆయన వైఎస్సార్‌సీపీని వదిలి, రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటారని వార్తలు కూడా వినిపించాయి.

అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే.. అవన్నీ కేవలం రూమర్స్‌గానే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో క్రమంగా చురుకుగా మారుతున్నారు. తాజాగా వంశీ, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. గూడూరు ప్రాంతంలో జగన్‌తో కలిసి కారులో పంట నష్టాలను పరిశీలించిన వంశీని చూసి, ఆయన మళ్లీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నారనే అభిప్రాయం అనుచరుల్లో నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..