AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vallabhaneni Vamsi: పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. అక్రమ మైనింగ్, భూ కబ్జా, దోపిడీ సహా ఇతర ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఏలూరు డీఐజీ అశోక్ కుమార్, సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్, ఈస్ట్ గోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ వ్యవహరించనున్నారు.

Vallabhaneni Vamsi: పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం..
Vallabhaneni Vamsi Case
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2025 | 7:49 PM

Share

వల్లభనేని వంశీని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్డు పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరింత విచారణ కోసం వంశీని పది రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో రేపటి నుంచి ఫిబ్రవరి 27 వరకూ వంశీని పోలీసులు విచారించనున్నారు. కాగా.. పోలీసులకు కోర్టు కొన్ని షరతులు విధించింది. విజయవాడ పరిధిలోనే వంశీని విచారించాలని కోర్టు తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని తెలిపింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు, వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీకి పడుకోవడానికి బెడ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే వంశీపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే వంశీపై తదుపరి చర్యలకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. కిడ్నాప్ కేసులో మూడు రోజుల విచారణ అనంతరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా సీఐడీ అధికారులు వంశీని కస్టడీకి కోరే అవకాశం ఉంది.

చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు..

కాగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. అక్రమ మైనింగ్, భూ కబ్జా, దోపిడీ సహా ఇతర ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఏలూరు డీఐజీ అశోక్ కుమార్, సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్, ఈస్ట్ గోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ వ్యవహరించనున్నారు. కృష్ణా జిల్లాలో గ్రావెల్‌, రాళ్లను తవ్వారని వంశీ, స్నేహితులు, అనుచరులపై అభియోగాలు ఉన్నాయి. అక్రమార్కులకు ఆర్థిక సహాయం చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. వంశీ చర్యలతో రాష్ట్రానికి రూ.195 కోట్ల నష్టం కలగడమే కాకుండా పర్యావరణానికి హాని కలిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..