AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination: ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి టీకా అప్పుడే కాదు.. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరకీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఈ తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది.

Vaccination: ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి టీకా అప్పుడే కాదు.. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
Vaccination
KVD Varma
|

Updated on: Apr 27, 2021 | 12:36 PM

Share

Vaccination: మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరకీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఈ తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా టీకాను 18 ఏళ్లు నిండిన వారికి జూన్ నుంచి ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే ముందు కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అయితే, వారంతా కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు మరికొంత సమయం పడుతుంది. టీకా సరఫరా కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటివరకూ ఈ విషయంలో ఒప్పందాలు జరగలేదు అని ఆయన చెప్పారు. అందుకే, పేర్ల నమోదు ప్రక్రియ తేదీ కూడా ఇంకా ప్రకటించలేదని తెలిపారు. త్వరలోనే తెదీ ప్రకటిస్తామన్నారు. ఈ కారణాలతోనే మే 1 వ తేదీకి కరోనా టీకను 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే అవకాశం లేదని అయన స్పష్టం చేశారు. జూన్ మొదటి వారంలో 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ పంపిణీ జరిగే అవకాశం ఉందని తెలిపారు.

అన్ని చర్యలు..

కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అనిల్ కుమార్ సింఘాల్‌ చెప్పారు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో 50 మంది పాల్గొనడానికే అనుమతి ఉంటుంది. ఈ విషయంలో జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఇక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్ లు మూసివేసినట్టు తెలిపారు. ప్రజారవాణా, సినిమా హాళ్ళు 50 శాతం సీట్ల సామర్ధ్యంతోనే నడుస్తాయి. అదేవిధంగా ఆసుపత్రులు అన్నిటిలోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రయివేట్ ఆసుపత్రులకూ రెమీడెసివిర్‌..

కొవిడ్‌ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు కూడా ఇవ్వనున్నట్టు సింఘాల్ పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు అనుమతినిచ్చిన ప్రైవేటు ఆసుపత్రుల వారు జిల్లాల్లో ఉండే డ్రగ్ కంట్రోల్ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈవిధంగా సోమవారం 11,453 ఇంజెక్షన్లు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా సరఫరా చేయడం జరిగిందన్నారు. సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం 32,810 ఇంజెక్షన్లు ఉన్నాయన్నారు. తాము 4 లక్షల ఇంజెక్షన్లకు ఆర్డర్లు పెట్టామని, ఈవారంలోగా మరో 50 వేలు వస్తాయని సింఘాల్‌ వివరించారు. రెమ్‌డెసివిర్‌ అక్రమ విక్రయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయముంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read: గుంటూరులో దారుణం.. మీవాళ్లు బతకాలంటే మీ ఆక్సిజన్‌ మీరే తెచ్చుకోండి.. పరుగులు పెడుతున్న కోవిడ్ రోగుల బంధువులు..!

Cricket Betting Racket: కిడ్నాప్ కేసును ఛేదించిన గుంటూరు పోలీసులకు షాకింగ్ న్యూస్.. అసలు దందా బట్టబయలు..!