Cricket Betting Racket: కిడ్నాప్ కేసును ఛేదించిన గుంటూరు పోలీసులకు షాకింగ్ న్యూస్.. అసలు దందా బట్టబయలు..!

ఐపీఎల్‌ మ్యాచ్‌ జరుగుతున్న వేళ గుంటూరులో క్రికెట్‌ లైవ్‌ డాట్‌ కామ్‌ పేరిట బెట్టింగ్‌ నిర్వహిస్తోన్న ముఠాకు పోలీసులు చెక్‌ పెట్టారు. నగర పాలెం పోలీసులు పక్కా నిఘా పెట్టి బెట్టింగ్‌ బ్యాచ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

Cricket Betting Racket: కిడ్నాప్ కేసును ఛేదించిన గుంటూరు పోలీసులకు షాకింగ్ న్యూస్.. అసలు దందా బట్టబయలు..!
Bust Cricket Betting Racket
Follow us

|

Updated on: Apr 25, 2021 | 1:59 PM

Cricket betting racket arrest: ఓవైపు కరోనా సెకండ్‌ వేవ్‌తో జనం పిట్టల్లారాలుతున్నారు. ఇలాంటి టైమ్‌లోనూ బెట్టింగాళ్లు బరితెగిస్తున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ జరుగుతున్న వేళ గుంటూరులో క్రికెట్‌ లైవ్‌ డాట్‌ కామ్‌ పేరిట బెట్టింగ్‌ నిర్వహిస్తోన్న ముఠాకు పోలీసులు చెక్‌ పెట్టారు. కింగ్‌ పొట్ల శీను అండ్‌ గ్యాంగ్‌ను కటకటాల బాటపట్టించారు. రియల్‌ ఎస్టేట్‌ దందాతో విలాసాల రుచిమరిచిన పెదకూరపాడుకు చెందిన శీను.. ఈజీ మనీ కోసం బెట్టింగ్‌ ఆట మొదలెట్టాడు. నగర పాలెం పోలీసులు పక్కా నిఘా పెట్టి బెట్టింగ్‌ బ్యాచ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఓ చార్టెట్‌ అకౌంట్‌ సహా మరికొందర్ని కలుపుకొని టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు పొట్ల శ్రీను. పొట్ల శ్రీనుతో సహా సూర్యతేజ, నాగూర్ వలీ అనే నిందితులు చిక్కారు. మరో బెట్టింగ్‌ రాయుడు సాయి పరారీలో వున్నాడు. నిందితుల నుంచి రూ.12 లక్షలు నగదు, బెట్టింగ్‌ సరంజామా సహా కారును సీజ్‌ చేశారు. ఈ ముఠాకు ఎవరెవరితో లింకులున్నాయనే డేటాపై కూడా ఫోకస్‌ పెట్టారు. పొట్ల శ్రీను డైరీలో బడాబాబుల పేర్లున్నాయా? వీళ్ల నెట్‌ వర్క్‌ లోకల్‌కే పరిమితమా? నేషన్‌ వైడ్‌ విస్తరించిందా? అనే కోణంలో కూపీలాగుతున్నారు పోలీసులు.

బెట్టింగ్‌ డబ్బులను దారి మళ్లించాడనే అనుమానంతో నాగూర్‌ వలీని పొట్ల శ్రీను అండ్‌ బ్యాచ్‌ చితక్కొట్టారు. దీంతో బెట్టింగ్‌ సహా కిడ్నాప్‌ అండ్‌ హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. పొట్ల శ్రీనుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామన్నారు గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

Read Also…  Prickly Heat: చెమటకాయలతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఇలా చేస్తే తగ్గిపోతాయి..