AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prickly Heat: చెమటకాయలతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఇలా చేస్తే తగ్గిపోతాయి..

వేసవి కాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ప్రిక్లీ హీట్. అంటే చెమట కాయలు. చాలా మందికి ఎండాకాలంలో

Prickly Heat: చెమటకాయలతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఇలా చేస్తే తగ్గిపోతాయి..
Prickly Heat
Rajitha Chanti
|

Updated on: Apr 25, 2021 | 1:44 PM

Share

వేసవి కాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ప్రిక్లీ హీట్. అంటే చెమట కాయలు. చాలా మందికి ఎండాకాలంలో ఈ సమస్య ఎదురవుతుంది. శరీరంపై చిన్న చిన్న పింపుల్స్ ఏర్పడి మంటను కలుగజేస్తాయి. బాగా వేడిగా, చెమట పట్టే వాతావరణంలో హీట్ రాష్ మొదవుతుంది. చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కలిసి చేమట గ్రంధులని మూసేస్తాయి. ఫలితంగా చెమట చర్మం లోపలే ట్రాప్ అయిపోతుంది. ఇది ఒక్కసారి బర్స్ట్ అయినప్పుడు పొడుస్తున్న ఫీలింగ్ ఉంటుంది, అందుకే ప్రిక్లీ హీట్ అనే పేరు వచ్చింది. ఈ ప్రిక్లీ హీట్ ని ప్రివెంట్ చేయడానికి ఇలా చేయవచ్చు. అయితే చెమటకాయలను తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి..

ముందుగా మీ శరీరాన్ని చల్లటి ప్రదేశంలో ఉంచాలి. అంటే శరీరానికి బిగుతుగాల ఉండే దుస్తులు కాకుండా వదులుగా ఉండే బట్టలు ధరించాలి. అప్పుడే ఎయిర్ సర్క్యులేషన్ ఉండి బాడీ కూల్ గా ఉంటుంది. సింథటిక్ బట్టలు, టైట్ గా ఉండే బట్టలు పూర్తిగా పక్కన పెట్టేసి కాటన్ బట్టలు వేసుకోండి. కాంటన్ మెటీరియల్ లో నుండి గాలీ ఫ్రీగా తిరగగలుగుతుంది. వేడిగాలి, ఎండలు శరీరంలోని శక్తీని పీల్చేస్తాయి. అందుకే ఎప్పుడూ హైడ్రేటెడ్‏గా ఉండేలా చూసుకోండి. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి నాచురల్ డ్రింక్స్ తాగండి. రేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎవాయిడ్ చేయడానికి చూడండి. మీ డైట్ లో ఫ్లేవర్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందు వల్ల మీకు సీజనల్ ఫ్రూట్స్, హెర్బ్స్ యొక్క ఫుల్ బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. లాడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వంటివి ఎక్కువగా తీసుకోండి. వేపుళ్లు, స్వీట్స్ తగ్గించండి. ఈ వేడి వాతావరణం లో స్కిన్ ని ఎప్పుడూ తడిగా ఉంచకండి. స్నానం చేసిన వెంటనే టవల్ తో అద్దుకోండి, అప్పుడే బ్యాక్టీరియా బిల్డప్ జరగకుండా ఉంటుంది. పౌడర్ వేసుకుని స్కిన్ కూల్ గా ఉండేలా చూసుకోండి.

చెమటకాయలను తగ్గించడం..

1. ముల్తానీ మట్టి చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో రెండు టెబుల్ స్పూన్స్ పుదీనా పేస్ట్ కలిపి తగినన్ని చల్లని పాలు పోసి స్పూన్ పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని స్కిన్ మీద అప్లై చేసి గాలికి ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

2. పెరుగు చర్మాన్ని బాగా చల్లబరుస్తుంది. చెమట కాయలు ఉన్న చోట పెరుగుని అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తగా అద్దండి. పెరుగులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి యాక్నే రాకుండా అడ్డుకుంటాయి. మీ స్కిన్ ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి.

3. గంధానికి చల్లటి ఫుల్ ప్యాట్ మిల్క్ కలిపి ఆ మిశ్రమాన్ని చెమట కాయలు ఉన్నచోట పట్టించి గాలికి ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లిటి నీటితో కడిగేయండి. ఇందులో ఉండే నాచురల్ ఆయిల్స్ సన్ ట్యాన్ పోగొట్టుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాయి.

Also Read:  సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..

రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. జలుబు, ఫ్లూను తగ్గించే టీ.. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..