Mother dead body: తల్లి మృతదేహన్ని తరలించేందుకు అంబులెన్స్ దొరకలేదు.. బైక్‌పైనే 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కుమారుడు

అనారోగ్యంతో మరణించిన వారి మృతదేహాల తరలింపు బంధువులకు కొత్త ఇక్కట్లను తెచ్చిపెడుతోంది. తాజాగా ఓ హృదయవిదారకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

Mother dead body: తల్లి మృతదేహన్ని తరలించేందుకు అంబులెన్స్ దొరకలేదు..  బైక్‌పైనే 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కుమారుడు
Mother Dead Body On Bike
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 27, 2021 | 12:25 PM

Mother dead body on bike: ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. మరోవైపు లాక్‌డౌన్ పేరుతో ఆంక్షలు.. అనారోగ్యంతో మరణించిన వారి మృతదేహాల తరలింపు బంధువులకు కొత్త ఇక్కట్లను తెచ్చిపెట్టింది. తాజాగా ఓ హృదయవిదారకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో మరణించిన ఓ తల్లి మృతి చెందింది. ఆ తల్లి మృతదేహన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు అంబులెన్స్ గానీ, ఇతర వాహనం గానీ దొరక్క ఆ కుటుంబ తల్లడిల్లింది. చేసేదీ లేక.. ద్విచక్రవాహనంపై కొడుకు 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన జి.చెంచుల(50) అనారోగ్యానికి గురికావడంతో కుమారుడు ఇంకో వ్యక్తి సహాయంతో ద్విచక్రవాహనంపై పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం, స్కానింగ్ నిమిత్తం కాశీబుగ్గ గాంధీనగర్ లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ అనంతరం తల్లి ఆరోగ్యం విషమించి మృతి చెందిందని కుమారుడు తెలిపాడు. అయితే పలాస, కాశీబుగ్గ పట్టణంలో కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించారు. కాగా, చెంచుల కరోనాతో మృతి చెందిందని మృతదేహాన్ని స్వగ్రామం కిల్లోయి తీసుకువెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, అంబులెన్స్ సిబ్బంది గానీ ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తున్నామని కొడుకు పోలీసుల ముందు కన్నీటిపర్యంతమయ్యాడు.

Read Also….Karuna Shukla: కరోనాతో.. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ప్రధాని వాజ్‌పేయి మేనకోడలు శుక్లా కన్నుమూత