Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. స్పష్టం చేసిన కేంద్రం..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక హోదా ఇచ్చిన విషయాన్ని కేంద్రం మరోసారి వెల్లడించింది.

Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. స్పష్టం చేసిన కేంద్రం..
Andhra Pradesh
Follow us

|

Updated on: Mar 21, 2023 | 10:34 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక హోదా ఇచ్చిన విషయాన్ని కేంద్రం మరోసారి వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా రాష్ట్రాలు, లేని రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండాపోయిందని లోక్‌సభలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వ్యవహారం మరోసారి లోక్‌సభ ముందుకు వచ్చింది. వైసీపీ లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఏ ప్రాతిపాదికన మంజూరు చేస్తారు? ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయకపోవడానికి కారణమేంటి? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందా? ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటిలోపు ప్రత్యేక హోదా ఇస్తారో చెప్పాలంటూ మొత్తం ఏడు ప్రశ్నలను వైసీపీ ఎంపీలు అడిగారు.

వైసీపీ ఎంపీల ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని మరోసారి స్పష్టంగా చెప్పారు. అంతే కాదు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామని నిత్యానందరాయ్‌ తన సమాధానంలో పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాల మధ్య తేడా లేకుండా పోయిందని వివరించారు. 2015 నుంచి 2018 వరకు EAP పథకాలకు తీసుకున్న రుణాలపై వడ్డీ కింద 15.81 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..